దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసీఆర్.. రైతులకు మేం చేసిన మేలేంటో..మీరు చేసిన ద్రోహమేంటో చర్చిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసీఆర్..  రైతులకు మేం చేసిన మేలేంటో..మీరు చేసిన ద్రోహమేంటో చర్చిద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు రెండున్నరేళ్లలో తాము చేసిన మేలేంటో..పదేళ్లలో  మీరు చేసిన ద్రోహమేంటో దమ్ముంటే కేసీఆర్  అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  సంగారెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. 

ఈ సందర్బంగా..  రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే కాగితం కాదు.. అది పేదవాడి ఆత్మగౌరవం.  ఆకలితో ఏ ఒక్కరు ఉండకూడదన్న ఇందిరమ్మ ఆశయంతో, నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చి అవమానిస్తే.. నేడు రైతుల దగ్గరే సన్నవడ్లను కొని, అదే బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వరి వేస్తే ఉరి అన్న  గత పాలకులకు సమాధానంగా.. నేడు రైతులకు బోనస్ అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామన్నారు రేవంత్ రెడ్డి. 21 వేల కోట్ల రుణమాఫీ, 90 వేల కోట్ల రూపాయల రైతు సంక్షేమమే మా నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు రేవంత్. 

బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తిన్నవారికి, పేదల కష్టాలు ఏమర్థమవుతాయని ప్రశ్నించారు రేవంత్.  డబుల్ బెడ్రూం ఇండ్లు రాని పేదలకు ఆశ కల్పిస్తూ.. 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతో నిర్మిస్తున్నామన్నారు.. ఆడబిడ్డల గౌరవం పెంచడమే కాకుండా, పెన్షన్ల పంపిణీలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.