ఒకేఒక్క పొరపాటు..అర్ధరాత్రి ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా..అద్భుతం జరగకపోయి ఉంటే..

ఒకేఒక్క పొరపాటు..అర్ధరాత్రి ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా..అద్భుతం జరగకపోయి ఉంటే..

ఒకే ఒక్క పొరపాటు.. కొన్ని వందల ప్రాణాలు పోతుండె.. అర్థరాత్రి రెండు విమానాలు ఆకాశంలో ఎదురెదురుగా ఢీకొట్టుకునే పరిస్థితి..రెండు విమానాలకు  ఒకేసారి ఒకే రన్ వేపై ల్యాండింగ్, టేకాఫ్ కు వచ్చాయి.. కంట్రోల్ రూంలో అంతా  గందరగోళం.. క్షణం ఆలస్యం చేసినా అంతే.. లేకుంటే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.. అమెరికాలోని ఫీనిక్స ఎయిర్ పోర్టులో దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన.. వివరాల్లో వెళితే.. 

శుక్రవారం రాత్రి జరిగిన ఈ దిగ్భ్రాంతికర ఘటనలో అమెరికాలోని ఫీనిక్స్ ఎయిర్ పోర్టు లో ఈ ఘటన జరిగింది. రెండు విమానాలు గాల్లోనే ఢీకొనే పరిస్థితి ఏర్పడింది.  ఒక విమానం టేకాఫ్ అవుతుండగా.. మరొకటి అదే రన్ వేపై ల్యాండింగ్ కు వచ్చాయి. దీంతో దాదాపు పదిహేను నిమిషాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంలో గందరగోళం నెలకొంది. రెండు విమానాల్లోని ప్రయాణికులు, పైలట్లు భయాందోళనకు గురయ్యారు. 

రెండు విమానాలకు ఒకటే నంబర్ కేటాయించడంతో..  

అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు విమానాలకు ఫ్లైట్ 2482 నంబర్లను కేటాయించడమే ఈ గందరగోళానికి కారణమైందని ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు. వాతావరణం సరిగా లేకపోవడంతో చికాగో నుంచి ఫీనిక్స్ వెళ్లే ప్రయాణికుల కోసం ఒక విమానం.. ఫినిక్స్ దాటి వెళ్లే ప్రయాణికులకోసం  మరొక విమానాన్ని ఏర్పాటు చేశారు. రెండింటికి ఒకటే నంబర్ ఇచ్చారు. చికాగోనుంచి వచ్చిన విమానం ఫినిక్స లో ల్యాండింగ్ కు దిగుతుండగా..  అదే సమయంలో ఫీనిక్స్ నుంచి మరో విమానం టేకాఫ్ అవుతోంది. రెండు విమానాలకు ఒకటే నంబర్ ఉండటంతో ఎయిర్  ట్రాఫిక్ కంట్రోలర్ ఇచ్చిన ఎనౌన్స్ మెంట్ రెండు విమానాల పైలట్లు  గందరగోళానికి గురయ్యారు. దాదాపు విమానాలు దగ్గరగా వచ్చాయి. 

కంట్రోలర్ చాకచాక్యంగా వ్యవహరించి ఎనౌన్స్ మెంట్  రెండు ఫ్లైట్లకు వేర్వేరుగా ల్యాండింగ్, టేకాఫ్ మేసేజ్  ఇవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. రెండు విమానాల ప్రయాణికులు, ఇటు కంట్రోల్ రూం సిబ్బంది ఊపరిపీల్చుకున్నారు.