హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. 2026–-27 విద్యాసంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నారు.
అర్హులైన విద్యార్థులు ఆయా తేదీల్లో నేరుగా కాలేజీలకు వెళ్లి ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. కాగా, మరోవైపు పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు ఫలితాలను వెల్లడించారు. మొత్తం1,619 మంది అభ్యర్థులు స్లైడింగ్ కోసం ఆప్షన్లు ఇచ్చుకోగా.. అందులో 1,229 మందికి సీట్లు కేటాయించారు. సీట్ల మార్పు పొందిన విద్యార్థుల వివరాలను https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
