గురుకుల స్టూడెంట్లకు వసతులు మెరుగుపరుస్తం :మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గురుకుల స్టూడెంట్లకు వసతులు మెరుగుపరుస్తం :మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం మసాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాంక్ డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ భవన్ ఎస్సీ గురుకుల హెడ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మినీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. గురుకుల విద్యాసంస్థలను దేశంలోనే ఆదర్శ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన,  అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా విస్తరిస్తున్నామని చెప్పారు.

అన్ని గురుకులాలు ఒకే చోట ఉండాలనే లక్ష్యంతో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మెరుగైన బోధన వాతావరణం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, విద్యా నాణ్యతను పెంచడంతో పాటు గురుకులాలు, పాఠశాలల్లో వసతుల అభివృద్ధికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ శారద, జాయింట్ సెక్రటరీలు సక్రు నాయక్, విజయలక్ష్మి, మధునాయక్ తదితరులు పాల్గొన్నారు.