ఖమేనీ మృతిపై మీ వైఖరేంటి..? మోదీ ప్రభుత్వ మౌనంపై సోనియా గాంధీ విమర్శలు

ఖమేనీ మృతిపై మీ వైఖరేంటి..? మోదీ ప్రభుత్వ మౌనంపై సోనియా గాంధీ విమర్శలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై మోదీ ప్రభుత్వ మౌనాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. మౌనంగా ఉంటే తటస్థంగా ఉన్నట్లు కాదని.. బాధ్యతారాహిత్యమని ఆమె అన్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు రాసిన ఆర్టికల్ లో.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్ తో ఇండియా వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తూ వస్తోందని గుర్తు చేశారు. భారత్ కు ఎన్నో సార్లు మద్ధతు ఇవ్వడంలో ఇరాన్ ముందున్న సంగతి మోదీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు. 

ఖమేనీ మృతిపై కేంద్రం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం బాధ్యతారాహిత్యమని ఆమె మండిపడ్డారు. దానికి  బదులు  మిడిల్ ఈస్ట్ లోసంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని  చెప్పడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోవదని అన్నారు. 

సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఆయనను వేటాడి స్ట్రైక్స్ నిర్వహించి హత్యకు పాల్పడ్డాయి. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను హత్య చేయడం అంతర్జాతీయ సంబంధాలను సమాధిలో కలిపేయమేనని అన్నారు. 

అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్ పై ఒత్తిడి తెస్తున్న క్రమంలో.. మోదీ కేవలం యూఏఈపై ఇరాన్ దాడిని ఆపాలనే మాటలకే పరిమితమయ్యారని.. కానీ దానికి ముందు పరిణామాలను  ప్రస్తావించలేకపోయారని అన్నారు. 

అధికారంలో ఉన్న నేతను చంపడం అంతర్జాతీయ చట్టాల్లో ఎక్కడా లేదని ఆమె అన్నారు. ముందస్తు యుద్ధం ప్రకటించకుండా.. ఏకంగా ఒక దేశాధినేతను చంపేయడం ఎలాంటి నీతి అని ప్రశ్నించారు. దీనిపై మోదీ ప్రభుత్వ వైఖరేంటో చెప్పాల్సి ఉందన్నారు. ఈ అంశంలో మోదీ విదేశాంగ విధానం సరైనదిగా లేదని మండిపడ్డారు. 

కశ్మీర్ అంశంలో భారత్ కు ఇరాన్ మద్ధతు:

1994 లో ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థలోని కొన్ని దేశాలు కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టాలనుకున్న సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని రిజొల్యుషన్ పాస్ చేయాలనుకున్నపుడు.. దాన్ని అడ్డుకోవడంలో ఇరాన్ కీలక పాత్ర పోషించింది. ఇండియన్ ఎకానమీ కీలక దశలో ఉన్నపుడు కశ్మీర్ ఇష్యూ అంతర్జాతీయంగా వెళ్లకుండా ఆపింది ఇరానేనన్న సంగతి మర్చిపోకూడదని ఆమె పేర్కొన్నారు.