మనసు కలవరపెట్టే ఘటన.. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు.. ఇద్దరు అమ్మాయిలు స్కూటి పై వెళ్తూ సడెన్ గా కిందపడిపోయారు. అక్కడున్న వారంతా బండి స్కిడ్ అయి పడిపోయారేమో అనుకున్నారు. కానీ జరిగింది వేరే.. అమ్మాయిలు వర్షపు నీటిలోనే గిలగిలా కొట్టుకుంటున్నారు. ఏంచేయాలో కొద్ది క్షణాలపాటు ఎవరికి అర్థం కాలేదు.. ఊపిరి బిగపట్టి చూస్తున్నారంతా..ఓ యువకుడి సాహసంతో అమ్మాయిలు తృటిలో ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారు. నేవి ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా నీల్లే.. బ్రిడ్జీలు, అండర్ పాస్ లు, కాలనీలో ఎక్కడ చూసిన మోకాల్లోతు వరద నీరు. జనజీవనం, వాహనదారుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుధవారం మధ్యాహ్నం వర్షం కారణంగా నేరూల్ ఎల్పీ బ్రిడ్జి కింద నిలిచిన వరద నీళ్లలో విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం నడిరోడ్డుపై జరిగింది. అమ్మాయిలు నీటిలో పడి షాక్ తో కొట్టుకుంటుంటే ఓ యువకుడి సాహసించి కర్రతో విద్యుత్ వైర్లను పక్కకు జరపడంతో కొద్దిపాటి గాయాలతో అమ్మాయిలు సేఫ్ గా బయటపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇలాంటి ఘటనే నిన్న (మంగళవారం) మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ లో కూడా జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా భారీ చెట్టు ఒకటి స్కూల్ బస్సుపై విరిగి పడటంతో ఓ స్టూడెంట్ స్పాట్ లోని చనిపోయాడు. 12 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించినవీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు.. వర్షాకాలంలో జరిగే అనుకోని ప్రమాదాలు,జరిగి నష్టంపై పెద్ద చర్చ పెట్టారు. ఓపక్క అధికారులు,ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూనే ఇలాంటి సమయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో సలహాలు ఇస్తున్నారు.
#BREAKING Two college girls were electrocuted and hospitalized after a short circuit under Nerul’s LP Bridge electrified accumulated rainwater amid heavy Navi Mumbai rains.#NaviMumbaiRains #MumbaiRains #SafetyAlert @NavilmumbaiCorp @MumbaiPolice pic.twitter.com/Ys5zeIGaNC
— jarvis ☠️ (@Vishii14) July 1, 2026
