ఓ మై గాడ్.. ఐటీ కంపెనీ డేకేర్ సెంటర్లో ఆయాల అరాచకాలు.. పిల్లల్ని వాషింగ్ మెషీన్లో వేసి.. టాయిలెట్ క్లీనర్ పోసి..

ఓ మై గాడ్.. ఐటీ కంపెనీ డేకేర్ సెంటర్లో ఆయాల అరాచకాలు.. పిల్లల్ని వాషింగ్ మెషీన్లో వేసి.. టాయిలెట్ క్లీనర్ పోసి..

బాబోయ్.. డేకేర్ సెంటర్లు అంటేనే పసిపిల్లలకు నరక కూపాలని గుర్తు చేస్తున్నారు వీళ్లు. బిజీ లైఫ్ లో.. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయకపోతే గానీ నడవని పరిస్థితుల్లో.. తాము వచ్చే వరకు పిల్లల ఆలనా పాలనా చూస్తారని జాయిన్ చేస్తే.. అన్నెం పున్నెం ఎరుగని పసి పాపలను టార్చర్ కు గురిచేస్తున్న డే కేర్ సెంటర్ల ఆయాలను ఎందరినో చూశాం. వీళ్లు అయితే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్. పిల్లలను చంపేయలేదు.. తప్ప మిగతా అంతా చేశారు. బెంగళూర్ లో క్యాప్ జెమినీ డే కేర్ సెంటర్ లో జరిగిన ఈ పైశాచిక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బెంగళూరులోని ఫేమస్ ఐటీ కంపెనీ క్యాప్ జెమినీకి చెందిన HAL క్యాంపస్ లోని డేకేర్ సెంటర్ లో వెలుగు చూసిన దారుణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పుడప్పుడే నడకలు నేర్చుకుంటూ.. మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న పసి పిల్లలను వాషింగ్ మెషీన్ లో వేశారు ఆయాలు. గుండె తరక్కుపోయే ఈ వీడియో చూసిన నెటిజన్లు వీళ్లు మనుషులా రాక్షసులా.. వీళ్లకు పిల్లలు లేరా.. అంటూ ఫైర్ అవుతున్నారు. 

క్యాంపస్ లోని డేకేర్ సెంటర్ సీసీ టీవీలో రికార్డైన వీడియోల ఆధారంగా బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత డేకేర్ సెంటర్‌‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

►ALSO READ | డేటింగ్ యాప్స్తో ఇంత డేంజర్ ఉందా..? నాలుగేళ్ల తర్వాత ఇంటర్నెట్లో ప్రైవేట్ వీడియోలు.. లబోదిబోమంటున్న మహిళ

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రెండు నుంచి మూడేళ్ల చిన్నారులు అల్లరి చేయటం, ఏడవటం మొదలైన సందర్భాల్లో  వాళ్లను లాలించడం మానేసి.. అసహనంతో ఆయాలు మాటల్లో చెప్పలేనంత టార్చర్ చూపించారు. ఆ పసికందులను వాషింగ్ మెషీన్ ఫ్రంట్ లోడింగ్ లో పెట్టారు. అంతే కాకుండా వెస్ట్రన్ టాయిలెట్ లోపల కూర్చోబెట్టి.. స్ప్రే తో వారి మొహం,  నోట్లో టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ కలిపిన వాటర్ స్ప్రే చేశారు. అంతటితో వదలకుండా వాష్​ రూమ్ లో ఉంచి  తాళం వేసి.. సైలెంట్ గా ఉండకుంటే లోపలే చస్తారు  అంటూ.. భయపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని క్యాప్ జెమినీ ఐటీ కంపెనీ డే కేర్ సెంటర్ లో ఈ దారుణ ఘటన జరగటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. జాబుకు వెళ్లే ఐటీ ఉద్యోగులు తమ పిల్లలను సెంటర్ లో విడిచి వెళ్తారని పోలీసులు చెప్పారు. ఆయాల పిల్లలను టార్చర్ చేస్తున్న వీడియోలు లభ్యమయ్యాయని.. చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా.. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో వైరల్ గా మారాయి. చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్ కు తెలిసేలా ఫార్వాడ్ చేశారు నెటిజన్లు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 

బాలల సంరక్షణ చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు ఈ అరాచకానికి పాల్పడిన ఐదు మందిపై కేసులు పెట్టారు. 

ఇటేవలే ఒక డే కేర్ సెంటర్ లో.. ఒక బాలుడిని మరో బాలుడు చచ్చేంతలా కొరికిన ఘటన వెలుగు చూసింది. పిల్లలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆయాలు.. రూమ్ లో బంధించి వెళ్లడంతో.. ఒక పిల్లవాడు మరో పిల్లవాడిని కొరికిన వీడియో ఇప్పటికీ వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. 

మహారాష్ట్ర శంభాజీ నగర్ లో జరిగిన ఈ ఘటనలో బాడీ నిండా పంటి గాట్లతో.. చచ్చిబతికాడు ఆ బుడతడు. దీనిపై దేశ వ్యాప్తంగా ఔట్రేజ్ వచ్చింది. డే కేర్ సెంటర్లపై నిఘా ఉంచాలని.. కఠిన చర్యలు తీసుకుని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అంతలోనే మరో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.