ఇప్పుడంతా డేటింగ్ కల్చర్. లవ్ ప్రపోజ్ చేయగానే.. షెల్ వి గో ఫర్ ఏ డేట్.. అనే పరిస్థితి. అభిప్రాయాలు కలిస్తే రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాం.. లేదంటే నీ దారి నీది.. నా దారి నాది. యూత్ నుంచి మిడిల్ ఏజ్ వరకు ఇప్పుడంతా ఇదే ట్రెండ్. అందుకోసం ఎన్నో డేటింగ్ యాప్స్. ఈ డేటింగ్ వ్యవహారం కొత్తగా, థ్రిల్లింగ్ గా ఉన్నా.. ఇందులో ఎంత డేంజర్ ఉందో ఒక మహిళ ఫిర్యాదును చూస్తే తెలుస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
ఒక 28 ఏళ్ల మహిళ 2022 లో ఒక వ్యక్తితో బంబుల్ డేట్ కు వెళ్లింది. ఇద్దరూ టైమ్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి మహిళతో అన్ని సంబంధాలు తెంచుకున్నాడు. ఫోన్ నెంబర్ నుంచి సోషల్ మీడియా వరకు ఆమెను బ్లాక్ చేశాడు. ఇంత సడెన్ గా బ్లాక్ చేయడంపై మొదట్లో కొంత బాధపడినా.. పోతే పోయిండులే.. పీడ విరగడైంది అనుకుంది ఆ మహిళ. కానీ ఆ తర్వాత పెద్ద ట్విస్టు ఆమెను షాకింగ్ కు గురిచేసింది.
బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల మహిళకు.. 2022 నవంబర్ లో బంబుల్ డేటింగ్ యాప్ (Bumble) ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. సోషల్ మీడియా ప్రొఫైల్స్ షేర్ చేసుకునే ముందు ఇద్దరూ క్లోజ్ గా చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత అభిప్రాయాలు కలవటంతో ఇన్ స్టా, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్రొఫైల్స్ షేర్ చేసుకున్నారు. ఆ వ్యక్తి బంబుల్ ప్రొఫైల్ ను ఇన్ స్టాతో వెరిఫై చేసుకున్నాక.. అతడు నిజాయితీ కలిగిన వ్యక్తే అని నమ్మింది.
ఇద్దరూ కలవాలనుకున్నారు. అందుకోసం ఎక్కడికో వెళ్లకుండా మొదట.. ఆ వ్యక్తి అపార్టుమెంటులోనే కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. డేట్ ఎక్కడైతే ఏంటి..? అనుకుని అపార్టుమెంటులోనే కలుసుకున్నారు. ఇద్దరూ ఇంటిమేట్ అయ్యే ముందు ఆమెకు ఆల్కహాల్ ఆఫర్ చేశాడు ఆ వ్యక్తి.
అదే వారి లాస్ట్ మీట్. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెనుంచి కటీఫ్ అయిపోయాడు. అన్ని అకౌంట్లు బ్లాక్ చేశాడు. కాంటాక్ట్ అయ్యేందుకు వీలు లేనంత దూరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ఆమె చెప్పింది. నో ప్రాబ్లమ్ జరిగిందేదో జరిగిపోయింది.. అనుకుంది ఆమె.
కానీ నాలుగేళ్ల తర్వాత ఆమెకు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆ వ్యక్తి. వారిద్దరి ప్రైవేట్ వీడియోలు రిడెట్ (Reddit) తో పాటు ఇతర అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చాయి. తన ప్రమేయం లేకుండా.. ఎప్పుడో జరిగిపోయిన డేట్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఆ మహిళ లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించింది.
ALSO READ : భార్య లావుగా ఉందని.. పిల్లలు పుట్టడం లేదని..గొంతు నులిమి చంపిన భర్త...
జూన్ 19న, తన పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోలు ఎలా రికార్డ్ చేశారు.. ఎలా అప్‌లోడ్ అయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మహిళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ వీడియోలన్నీ ఇప్పటికే సోషల్ మీడియా నుంచి డిలీట్ అయ్యాయి.
డేటింగ్ కల్చర్ లో.. సరదాగా వ్యక్తులను కలిసినా.. కొన్నిసార్లు డీప్ రిలేషన్ లోకి వెళ్లినా.. అది ఎంత దూరం వెళ్తుందో ఈ ఘటన బెస్ట్ ఎగ్జాంపుల్. డేటింగ్ యాప్స్, కల్చర్ కొత్తగా.. కొందరికి ముచ్చటగా అనిపించినా.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో యువత ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెళ్లికి ముందు చేసే డేటింగ్.. పెళ్లి తర్వాత కొందరి జీవితాలను నరక కూపంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని.. వ్యక్తిగత గౌరవ ప్రదమైన జీవితం రోడ్డు పాలు కాకుండా.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
