సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బర్త్ డే సందర్భంగా చిత్రీకరించిన పోస్టర్ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఎస్పీ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోస్టర్ లో అఖిలేష్ యాదవ్ ను రాజ్యాంగం పట్టుకున్న కృష్ణుడి వేషంలో చిత్రీకరించారు. అఖిలేష్ యాదవ్ రాజ్యాంగబద్దం నడుచుకుంటారు.. రాజ్యాంగం, న్యాయ పరిరక్షణలో అఖిలేష్ యాదవ్ ఉన్న నిబద్ధత ప్రతీక అని ఎస్పీ యువజన్ సభ యూపీ ప్రధాన కార్యదర్శి ఈ పోస్ట్ చేశామని చెప్పారు. అయితే అఖిలేష్ ను శ్రీకృష్ణుడిగా చిత్రీకరించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాజకీయ ఎజెండాతో సనాతన ధర్మాన్ని అవమానించారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి.. ఎస్పీ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
►ALSO READ | ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని.. ఖర్గే, ఖుర్షిద్, ఖేరాలకు ఇరాన్ ఆహ్వానం
ఎంపీ అఖిలేష్ ఎజెండా మతపరమైన ప్రసన్నతపై ఉంటుంది. సనాతన ధర్మాన్ని అవమానించే ఏ అవకాశాన్ని వారు వదులుకోరు.. రామ్ లల్లా ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. శ్రీకృష్ణుని జన్మస్థలంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్న అఖిలేష్ యాదవ్.. దేవుడిని అవమానించే విధంగా దేవతలుగా చిత్రీకరిస్తున్నారు. దీనికి బాధ్యులైన సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల మత మనోభావాలను దెబ్బతీసినందుకు తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
VIDEO | Varanasi: Samajwadi Party workers unveiled posters of Akhilesh Yadav depicted as Lord Krishna on his birthday. pic.twitter.com/JuKCZ5Jnvt
— Press Trust of India (@PTI_News) July 1, 2026
