భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది: పాక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది: పాక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతోన్న వేళ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‎పై భారత్ మరో యుద్ధానికి సిద్ధం అవుతోందని ఆరోపించారు. సోమవారం (మార్చి 2) పార్లమెంట్ సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగిస్తూ.. ‘‘భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు. 

కానీ ప్రాంతీయ శాంతికి జీవితాంతం మద్దతుదారుడిగా నేను యుద్ధానికి ఒప్పుకోను’’ అని అన్నారు. యుద్ధ క్షేత్రం నుంచి అర్థవంతమైన చర్చల వైపు రావాలని ఢిల్లీని కోరుతున్నానని అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారమే ప్రాంతీయ భద్రతకు ఏకైక మార్గమని నీతులు వల్లించారు. మరోవైపు.. పాకిస్తాన్‎తో తలపడుతోన్న ఆప్ఘానిస్తాన్‎ను కూడా చర్చలకు రావాలని జర్దారీ పిలుపునిచ్చారు.

2025, ఏప్రిల్ 22న ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము కాశ్మీర్‎లో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. బైసరన్ మైదానం ప్రాంతంలోని పహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు. 

పహల్గాం టెర్రర్ ఎటాక్‎కు కౌంటర్‎గా ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేశాయి భారత దళాలు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ గజగజ వణికి.. కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది.