Kitchen Tips : ఆరోగ్యానికి వంట పాత్రలే కీలకం.. ఏ వంటకానికి ఎలాంటి గిన్నె వాడాలి..

Kitchen Tips :  ఆరోగ్యానికి వంట పాత్రలే కీలకం..  ఏ వంటకానికి ఎలాంటి గిన్నె వాడాలి..

ఆరోగ్యకరమైన ..  రుచికరమైన వంటకాల తయారీకి సరైన వంట పాత్రలను ఉపయోగించాలి.  పూర్వకాలం వంటలు ఎంతో రుచిగా ఉండేవి.  ఒకప్పుడు అవ్వలు వంటింట్లో మొత్తం మట్టి పాత్రలనే వాడేవాళ్లు. వంట చేయాలన్నా, కూరలు ఊడ్చిపెట్టుకోవాలన్నా అన్నీ మట్టి గిన్నెలే. కానీ ఇప్పటి మోడర్న్ కిచెన్​ లో  రకరకాల మెటల్ గిన్నెలుంటున్నాయి. వంటపాత్రలు ఒక్కోదాన్ని ఒక్కో మెటల్​ తో  తయారు చేస్తున్నారు. కానీ వాటన్నింటినీ వాడే ముందు ఏవి ఆరోగ్యానికి మంచివో, వేటివల్ల నష్టాలుస్తాయో..  అందువల్ల ఎలాంటి మెటల్ గిన్నెలు.. ఎప్పుడు ఎలా వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  !

కుకింగ్ ని ఎప్పుడూ ఒక ఆర్ట్ గా ఫీలవ్వాలి. వంటకు కావాల్సిన పదార్థాలను ఎంచుకునే దగ్గరి నుంచి ఎంత మోతాదు మంటపై వండాలో ఒక మంచి కుక్​ కే  బాగా తెలుస్తుంది. అన్నీ కరెక్ట్ గా సెట్ అయితేనే వంట రుచి కుదురుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని వంట చేసే ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. అదేంటంటే  వంటకు ఎలాంటి గిన్నెలు వాడుతున్నారో చూసుకోవాలి. ఆయా మెటల్ క్వాలిటీ వంట రుచిపైనే కాదు, తినేవాళ్ల ఆరోగ్యంపైనా మంచి, చెడు ప్రభావాలు చూపిస్తాయి. 

ఇత్తడి గిన్నెలు:  పాత రోజుల్లో వాడిన లోహాల్లో ఈ ఇత్తడి ఒకటి. దీన్ని ఇప్పటికీ చాలామంది ట్రెడిషనల్ వంటల కోసం ప్రత్యేకంగా వాడతారు. ఈ ఇత్తడి గిన్నెలకు అడుగుభాగం మందంగా ఉండటం వల్ల వాటిని ఎక్కువగా మటన్, చికెన్, బిర్యానీ వంటల కోసం ఉపయోగిస్తారు. కానీ ఇత్తడిని పెద్ద మంటపై పెట్టి ఉప్పు కలిపిన వంటకాన్ని వండితే, అది ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే చాలావాటికంటే ఈ ఇత్తడి గిన్నెలు కొంత బెటర్. రెగ్యులర్​ గా కాకుండా అప్పుడప్పుడు వాడొచ్చు.

అల్యూమినియం గిన్నెలు :  ఈ మెటల్​ ను మంచి హీట్ కండక్టర్ గా చెప్పొచ్చు. అందుకే చాలామంది అల్యూమినియం గిన్నెలనే ఎక్కువగా వంటకు వంట గిన్నెలకీ ఉపయోగిస్తారు. కానీ వీటిని పెద్దమంటపై పెట్టి... అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండే టొమాటో, వెనిగర్ వంటివి ఉపయోగించి చేసే వంటలో రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కెమికల్ రియాక్షన్ జరిగి అల్యూమినియం పార్టికల్స్ వంటకంలో కలుస్తాయి. అలాంటి ఆహారం తీసుకుంటే మెల్లిగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, అల్యూమినియం గిన్నెలో కూరలు వండినప్పుడు చెక్క చెంచాను. ఉపయోగించాలి. ఒకవేళ స్టీల్ చెంచా వాడితే. కూర కలుపుతున్నప్పుడు బేస్ లైనింగ్ మెల్లిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.

కాపర్ కుక్​ వేర్ : ఒకప్పటికంటే ఇప్పుడు కాపర్ కుక్​ వేర్ గురించి బాగా చర్చ జరుగుతోంది. జనరల్ గా రాగి పాత్రల్లోని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అదే రాగి వంట చేయడానికి పనికిరాదు. ఎందుకంటే రాగి నేచర్ రియాక్టివ్ కావడంవల్ల వాటిలో ఉప్పు కలిపేవి వండకూడదు. ఉప్పులోని అయోడిన్ కాపర్​ తో  వెంటనే రియాక్ట్ అవ్వడంవల్ల, కాపర్ పార్టికల్స్ వంటలోకి విడుదలవుతాయి. అలాగే కాపర్ కుక్కింగ్ గిన్నెలకు లైనింగ్ లేదా కోటింగ్ సరిగ్గా లేకపోయినా, దానికి వేడి తగలగానే అందులోని హానికరమైన కెమికల్స్ రిలీజవుతాయి. అవి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. రాగి వల్ల లాభాలు పొందాలంటే... వంట పాత్రలుగా కాకుండా గ్లాసులుగా, ప్లేట్స్​ గా వాడాలి.

ఈ గిన్నెలోనే ఆరోగ్యం..!

వంట చేయడానికి ఐరన్ (ఇనుము), స్టెయిన్​ లెస్ స్టీల్, మట్టి పాత్రలు వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. పైగా ఎన్నో లాభాలున్నాయి.

మట్టి పాత్రలు : వంటకు కావాల్సిన పదార్థాలన్నీ మట్టి పాత్రల్లో వేసి స్టవ్ పై పెడితే.. వేడి, మాయిశ్చర్ పూర్తిగా సర్క్యులేట్ అవుతాయి. దానివల్ల పోషకాలు బయటికి పోకుండా ఆహారంలోనే ప్రిజర్వ్ అవుతాయి. ఒకప్పు డు వీటిలోనే వండేవాళ్లు కాబట్టి గంజి తాగినా ఆరోగ్యంగా ఉండేవాళ్లు.
ఈరోజుల్లో ఇవి విరివిగా దొరక్కపో యినా, మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కాకపోతే ఈ మట్టి పాత్రలను జాగ్రత్తగా వాడాలి..

స్టెయిన్లెస్ స్టీల్: దీన్ని వంట చేయడానికి వాడే బెస్ట్ మెటల్ గా చెప్పొచ్చు.
వీటిని క్రోమియం, నికెల్, సిలికాన్ , కార్బన్ పదార్థాలతో తయారు చేస్తారు. అందువల్ల ఎంత వేడినైనా, ఎంత సమయమైనా తట్టుకుని ఎక్కువ మన్నికతో పని చేస్తాయి. మార్కెట్లో స్టెయిన్​ లెస్ స్టీల్ పేరుతో కొన్ని డూప్లికేట్ పాత్రలు వస్తున్నాయి. వాటిలో వండితే హానికరమైన కెమి కల్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టీల్ సామాన్లను కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. 

ఐరన్ (ఇనుము) : లోహాలన్నింట్లోకీ అద్భుతమైన మెటల్ అంటే ఐరన్. దీంతో తయారు చేసిన గిన్నెల్లో వంట చేస్తే, ఆ వంటకం ఆరోగ్యానికి చాలా మంచిది. క్వాలిటీ ఐరన్ గిన్నెల్లో వంట చేస్తే, పోషకాలన్నీ అందులోనే ఉంటాయి.

ఇప్పటికిప్పుడు కిచెన్​ లో ఉన్న రాగి, ఇత్తడి, అల్యూమినియం గిన్నెలను బయట పారేయనక్కర్లేదు. మెల్లిగా ఒకటి, రెండు రీప్లేస్ చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకు అల్యూమినియం కుక్కర్ కి బదులుగా స్టీల్ కుక్కర్ రాగి కళాయి స్థానంలో ఐరన్ కళాయిని వాడాలి. ఇలా కిచెన్ లో చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.