Anupama Parameswaran: ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్?.. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పోస్ట్స్ వైరల్!

Anupama Parameswaran: ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్?.. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ పోస్ట్స్ వైరల్!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కోలీవుడ్ స్టార్ కిడ్ ధృవ్ విక్రమ్ మధ్య గత కొంతకాలంగా గట్టిగానే ప్రేమాయణం నడుస్తోందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. మరి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'బైసన్ కాలమాదన్' సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. అవార్డు ఫంక్షన్లలో స్టేజ్ మీదే ఒకరికొకరు '2 AM కాల్' అంటూ సిగ్గుపడటం, ముంబై ఈవెంట్‌లో క్లోజ్ సెల్ఫీలతో హార్ట్ ఎమోజీలు పెట్టుకోవడంతో ఈ రూమర్స్ నిజమే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆఖరికి వీరిద్దరి సీక్రెట్ స్పాటిఫై (Spotify) ప్లేలిస్ట్ డీపీగా ఉన్న ఒక కిస్సింగ్ పిక్ కూడా బయటకు రావడంతో సోషల్ మీడియా షేక్ అయింది.

ధృవ్ విక్రమ్‌తో బ్రేకప్?

అయితే, గత కొన్ని నెలలుగా సైలెంట్ అయిపోయిన ఈ జోడీ.. లేటెస్ట్ గా బ్రేకప్ చెప్పుకుందంటూ ఇండస్ట్రీలో ఒకటే టాక్ వినిపిస్తోంది.  చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అనుపమ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని ఎమోషనల్,  క్రిప్టిక్ పోస్టులు దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. 'ఇకపై ఎవరి అప్రూవల్స్, పర్మిషన్లు అవసరం లేదు.. నా జీవితం, నా వాయిస్ నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు.. ఎట్టకేలకు శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది' అంటూ అనుపమ పెట్టిన క్యాప్షన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

డెడ్ ఎండ్స్ వదిలేశా.. ఇక ఫ్రీడమ్..

ఎల్లో డ్రెస్‌లో దిగిన అందమైన ఫోటోషూట్ షేర్ చేస్తూ.. 'కొన్నిసార్లు మన శాంతి కోసం డెడ్ ఎండ్స్‌ని వదిలేయక తప్పదు. ఇంతకాలం నన్ను నేను మర్చిపోయాను, ఇప్పుడు మళ్లీ నా వైపు నేను అడుగులు వేస్తున్నాను. ఇది నా హీలింగ్, నా ఫ్రీడమ్' అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు, చిన్నప్పటి తనను తాను కౌగిలించుకున్నట్లు ఉన్న ఒక ఏఐ (AI) ఫోటోను కూడా షేర్ చేసింది. మరోవైపు స్టోరీస్‌లో 'అకౌంటబిలిటీ .. కొందరు వ్యక్తులు బాధ్యతల నుంచి తప్పించుకుంటారు'అంటూ పెట్టిన పోస్ట్ నేరుగా ధృవ్ విక్రమ్‌ను ఉద్దేశించేనని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

 

ప్రేమలో పీక్స్‌కి వెళ్లి, ఇప్పుడు ఇలా విడిపోవడంపై రీసెంట్ ఎలక్షన్లలో ఓడిపోయిన పొలిటీషియన్ల కంటే ఎక్కువే చర్చ జరుగుతోంది. 'అనుపమ క్యాప్షన్ చూస్తుంటే పక్కా బ్రేకప్ అని అర్థమవుతోంది. పాప మెమొరీస్ నుంచి బయటపడటానికి హెయిర్ కట్ కూడా చేసుకున్నట్లు ఉంది' అని ఎక్స్ , రెడ్డిట్ వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ కేరళ కుట్టి పెట్టిన పోస్టులు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వైరల్ టాపిక్‌గా మారాయి. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరిలో ఎవరూ తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా స్పందించలేదు. 

ALSO READ : ధురంధర్ డైరెక్టర్ భార్యకు నేషనల్ అవార్డు