72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బాలీవుడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్టికల్ 370’ దుమ్ములేపింది. ఈ సినిమాలో తన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన యామీ గౌతమ్.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ధురంధర్ డైరెక్టర్ భార్య యామీ గౌతమ్‌ను అభినందిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తనదైన శైలిలో స్పందించిన ఆర్జీవీ.. తనకు అవార్డులపై నమ్మకం లేదని చెప్తూనే, యామీ ప్రతిభను కొనియాడారు.
ఆర్జీవీ X వేదికగా యామీపై ప్రశంసలు కురిపిస్తూ..‘‘హే యామీ గౌతమ్ (Yami Gautam).. నాకు అవార్డులనే కాన్సెప్ట్ మీద ఎప్పుడూ నమ్మకం లేదు, నమ్మను కూడా. కానీ ఒక వ్యక్తి తన వృత్తి పట్ల ఎన్నేళ్లుగానో చూపిస్తున్న నిబద్ధతకు, నిజాయితీకి దక్కే గుర్తింపును మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ గౌరవం నీకు మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ‘ఆర్టికల్ 370’ నీకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన కథ. ఆ నమ్మకాన్నే తెరపై అద్భుతంగా పండేలా నటించావు.
ఈ జాతీయ అవార్డు నీకు ఒక గొప్ప గౌరవంగా అనిపించవచ్చు. కానీ నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి సాగించిన ప్రయాణం, నీ పోరాటాలు, పట్టుదల, తీసుకున్న రిస్క్‌లు, నీపై నీకున్న నమ్మకం, ఎక్కడా వెనకడుగు వేయని నీ తత్వం నన్ను వ్యక్తిగతంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇవే నిన్ను ఇటుక ఇటుక పేర్చి ఈ విజయ శిఖరానికి చేర్చాయి. భవిష్యత్తులో నువ్వు ఇలాంటివి మరెన్నో సాధిస్తావని ఖచ్చితంగా నమ్ముతున్నాను’’ అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్‌తో యామీ గౌతమ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ న్యూస్ సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్‌గా మారింది.
Hey @yamigautam , i don’t and never believed in the concept of awards, but I do believe in the power of recognition especially when it comes from many years of sincerity along with an unwavering commitment to one’s craft.
— Ram Gopal Varma (@RGVzoomin) July 19, 2026
What makes it even more special is that this honour has… https://t.co/DIBxJp6f1B
ఇదిలా ఉంటే, సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యామీ గౌతమ్‌కు ‘ఆర్టికల్ 370’ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడం పట్ల అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి నేషనల్ అవార్డ్స్ రేసులో కంటెంట్ ఉన్న సినిమాలు, అద్భుతమైన క్రాఫ్ట్ వర్క్ చూపించిన టెక్నీషియన్స్ కే ఎక్కువ అవార్డులు దక్కడం విశేషం!
‘ఆర్టికల్ 370’ సాధించిన అవార్డులు
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (Best Feature Film)
ఉత్తమ నటి (Best Actress) - యామీ గౌతమ్
ఉత్తమ సంగీత దర్శకుడు (Best Music Director) - శాశ్వత్ సచ్‌దేవ్
టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటి యామీ గౌతమ్. 2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్‌లో యామి గౌతమ్ ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ ను ప్రేమించి పెళ్లాడింది. తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉంది.
