అయోధ్య టెంపుల్ విరాళాల చోరీ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు సాధారణమైన నేరమే. ఈ కేసును రాజకీయం చేయొద్దంటూ సూచించింది. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని దాఖలైన పిటిషన్లను సోమవారం (జూలై 20) సుప్రీంకోర్టు విచారించింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనంఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది కోర్టు.. ఇక్కడ రాజకీయం చేయొద్దు..కోర్టులు రాజకీయ వేదికలు కాదు.. ఇది కేవలం సాధారణ నేరమే.. సరైన దర్యాప్తు జరిగేలా చూడటమే మాపని అని అన్నారు. ఈ కేసును జూలై 27న విచారిస్తామని కోర్టు తెలిపింది.
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై అన్ని వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.
