ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

 ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

లైంగిక ఆరోపణలు ఎందుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ విజయ కృష్నారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ( జులై 20) ఎర్రగడ్డ, మోతీనగర్ ప్రాంతంలో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డ - ఎస్ ఆర్ నగర్ లోని జయంత్ హస్పిటల్ లో ఉదయ్ కృష్ణా రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ట్రైనీ మహిళా ఐపీఎస్ పై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డిప అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 8 రోజులలో వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపారు. లైంగిక ఆరోపణలతో సొంత గ్రామానికి వెళ్లిన విజయ కృష్ణారెడ్డి.. పోలీసుల నోటీసులతో హైదరాబాద్ వచ్చారు. వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చి.. ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. 

సస్పెండ్ చేసిన నేషనల్ పోలీస్ అకాడెమీ (NPA):

లైంగిక ఆరోపణలు వచ్చిన క్రమంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది NPA .  ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని  NPA నుంచి అధికారులు పంపించారు. 

ఉదయ్ కృష్ణా రెడ్డి ప్రవర్తన గురించి మొదట NPA అధికారులకు ఫిర్యాదు చేశారు మహిళా IPS. ట్రైనీ ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలు ఆధారాలతో పాటు అన్ని ఎవిడెన్స్ సేకరించాక.. ఉదయ్ కృష్ణా రెడ్డి పై ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది ప్రివిలేజ్ కమిటీ. 

తక్షణమే NPA నుండీ సస్పెండ్ చేస్తూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సర్వీస్ లో జాయినింగ్ కు సంబంధించి డివోపిటీదే తుది నిర్ణయం అని ఈ సందర్భంగా NPA అధికారులు చెప్పారు.