తిరుమలలో అంగరరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల్లో నిర్వహించిన గజసేవలో రష్యన్ భక్తుడు పాల్గొన్నాడు. గోవిందా... గోవిందా... అంటూ శ్రీవారి నామస్మరణ చేస్తూ..స్వామివారి వైభవాన్ని చూసి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
తిరుమలను భూవైకుంఠంగా అభివర్ణించిన ఆయన... భక్తులు ఎంతో శ్రమతో, భక్తిశ్రద్ధలతో స్వామివారికి సేవ చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.భగవంతుడిపై ఇక్కడి భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం... ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తోందని చెప్పారు. తిరుపతికి రావడం ఇదే తొలిసారి అని తెలిపిన ఆ రష్యన్ భక్తుడు... చివరగా “గోవిందా... గోవిందా...” అంటూ నినదిస్తూ శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నారు.
►ALSO READ | జూరాల నుంచి నీళ్లు ఇవ్వకపోవడానికి బీఆర్ఎస్సే కారణం: మంత్రి జూపల్లి
