డీజీపీ స్థాయి అధికారి ఆఫీసులోనే ఆత్మహత్యకు కారణాలేంటి.? త్రిపురలో ఏం జరిగింది.?

డీజీపీ స్థాయి అధికారి ఆఫీసులోనే ఆత్మహత్యకు కారణాలేంటి.? త్రిపురలో ఏం జరిగింది.?

త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. డీజీపీ స్థాయి వ్యక్తి  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అని ఆరాదీస్తున్నారు.   2026  జూలై 20న అగర్తలలోని పోలీస్ ప్రధాన కార్యాలయం (PHQ) లోని తన చాంబర్‌లో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

  ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం  ప్రాథమిక నివేదికల ప్రకారం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని నివేదికలు ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొనగా, మరికొన్ని నివేదికలు ఆయన ఆఫీసు గదిలో లేదా దానికి అనుబంధంగా ఉన్న వాష్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించినట్లు తెలిపాయి.  

 ఇవాళ  మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయనను అగర్తలలోని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్, బీపీ వంటి ఎలాంటి జీవన లక్షణాలు లేవని, వైద్యులు 48 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో  జులై 20 న మధ్యాహ్నం 12:48 గంటలకు మరణించినట్లు ప్రకటించారు.   మరణానికి గల ఖచ్చితమైన కారణాలు , పరిస్థితులు పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే స్పష్టమవుతాయని వైద్యులు, పోలీస్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం దీనిపై మేజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.   

ALSO READ : సోనమ్ వాంగ్ చుక్ భార్యను జుట్టు పట్టి కొట్టారు

అనురాగ్ ధన్‌ఖడ్ 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో సిబిఐ (CBI) లో కీలక బాధ్యతలు నిర్వహించి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ (నీరవ్ మోదీ కేసు) విచారణకు నేతృత్వం వహించారు. మే 2025 లో ఆయన త్రిపుర డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.  ఆయన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.