ఢిల్లీలో ఉద్రిక్తతల నడుమ సీజేపీ నేతలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. మూడు డిమాండ్లతో ఓ లెటర్ ను నడ్డాకు అందజేశారు. వాంగ్ చుక్ వెంటనే విడుదల చేయాలని, నీట్ ఎగ్జామ్ లీకులకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, నీట్ ఎగ్జామ్ రద్దు కావడంతో ఆత్మహత్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మూడు ప్రధాన డిమాండ్లను కోరారు.
జేడీ నడ్డాను కలిసినట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో తెలిపారు. జేపీ నడ్డాను కలిశాం.. పది నిమిషాల పాటు చర్చలు జరిపాం.. తమ డిమాండ్లతో కూడిన లెటర్ ను నడ్డాకు అందజేశామన్నారు. అయితే నడ్డా తమకు ఎటువంటి హామీ ఇవ్వలేదని.. అంతర్గతంగా చర్చిస్తామని చెప్పినట్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు కొనసాగిస్తామని సౌరవ్ దాస్ సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు.
సోమవారం ( జూలై 20) సీజేపీ పార్లమెంట్ మార్చ్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులు, సీజేపీ సపోర్టర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలితోపాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలో జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లను తెలిపారు.
మరోవైపు ఆందోళనలను విరమించాలని సీజేపీ ప్రతినిధులను ప్రభుత్వం కోరింది. సీజేపీ ప్రతినిధులతో సమావేశం అనంతరం నిరసనకారులను ధర్మా విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను తెలిపారు.
