చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడి తీవ్రత అధికంగా ఉంటుంది. మార్చి 3న ఏర్పడేది కేతు గ్రస్త చంద్రగ్రణమని చెబుతున్నారు. కేతువు చెడు దృష్టి..చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గేందుకు గ్రహణ సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై దర్భ(గరిక)ను ఎందుకు ఉంచుతారు? ఏ సమయంలో వేయాలి.. ఇంట్లో ఎక్కడెక్కడ వేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. .
చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు కేతువు ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆహార పదార్ధాలపై చంద్రుని కిరణాణాలు... కేతువు చెడు దృష్టి పడి.. చాలా నష్టం జరుగుతుంది. సమయంలో దర్భ( గరిక)ను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి ఉంచుతారు.
ఖగోళశాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ... చంద్ర గ్రహణ సమయంలో .. చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. పురాణాల ప్రకారం దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయి.
గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే పదార్ధాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.
గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా .. అధిక శక్తితో ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో వాటి శక్తిని బలహీన పరిచేందుకు .. వాటి ప్రభావం తగ్గేందుకు.. ఎలాంటి హాని చేయకుండా.. ఆహార పదార్థాలను ముట్టకూడదని పెద్దలు అంటారు. అందుకే దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలు, గృహాలను నీటితో సంప్రోక్షణ చేయడంతో ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి.
హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు గ్రహణాలు అశుభకరంగా భావిస్తారు. ప్రపం, వ్యాప్తంగా చంద్రగ్రహణం మార్చి 3 మధ్యాహ్నం సంభవించబోతోంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. కాని భారతదేశంలో మాత్రం పాక్షికంగా చివరి 27 నిమిషాలు కనిపిస్తుంది.
ఏ సమయంలో వేయాలి
గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్ధాలపై గ్రహణ సమయానికి 3 గంటలు ముందుగా దర్భ వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. దర్భలు చాలా పవిత్రమైనవి. అందుకే వాటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు.
గ్రహణానికి ముందు ఎక్కడెక్కడ దర్భ వేయాలి
- 1.గ్రహణానికి ముందుగా దర్భలు ఇంటిపై వేయాలి. అపార్ట్ మెంట్లలో నివసిస్తుంటే టెర్రర్స్ పై వేయాలి.
- 2. వాటర్ ట్యాంక్ పైన
- 3. నిల్వ మామిడికాయ పచ్చడి, ఇతర పచ్చళ్లు పెట్టే పాత్రల మూతలపై
- 4.కూలర్ లపైన
- 5. ఫ్రిజ్ పైన
- 6. దేవుడిని పెట్టిన బల్లపైన
- 7. తులసి కోట దగ్గర
- 8. వాహనాలపైన
- 9. కిరాణా సరుకులు పెట్టే ప్రదేశంలో
- 10. కంప్యూటర్ పైన
- 11. టీవీ పెట్టిన చోట
- 12. బీరువాలపైన
- 13. మిక్సీ.. గ్రైండర్ పైన
- 14. స్టవ్ పైన
- 15. ధాన్యం నిల్వ చేసే గోదాములపైన
ఆ విధంగా చేసినటైతే దర్భలు గ్రహణం రేడియేషన్ ను తొలగిస్తాయంటారు. గ్రహణ సమయాలలో ఉత్పత్తి అయ్యే ఫలితాన్ని అల్త్రా వైలెట్ కిరణాల ప్రభావాన్ని అవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో, పచ్చళ్లపై ఉంచినట్టు అయితే.. గ్రహణ ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు.
