నిమ్జ్లో సౌకర్యాలు కల్పించండి.. అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

 నిమ్జ్లో సౌకర్యాలు కల్పించండి.. అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని నిమ్జ్​లో  మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు స్పీడప్ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిమ్జ్, రెవెన్యూ, సర్వే, టీజీఐఐసీ అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిమ్జ్​లో మౌలిక సౌకర్యాలు కల్పించే ఎస్ఆర్అర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటివరకు సేకరించిన భూములను అప్పగించాలని సూచించారు. 10 రోజుల్లో సర్వే పూర్తి చేసి, లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో  హద్దురాళ్లు నాటాలన్నారు.

గతంలోనే భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించామని, కానీ ఆయా భూముల్లో పనులు చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం ఇచ్చామన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపట్టనుండటంతో ప్రస్తుత పంటల కోతలు పూర్తయ్యేదాక వేచిచూసి, ఇకపై పంటలు వేయకుండా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి, తహసీల్దార్లు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.