కాంగ్రెస్‌‌‌‌లో చేరిన బీఆర్ఎస్ సర్పంచులు.. ఆహ్వానించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్‌‌‌‌లో చేరిన బీఆర్ఎస్ సర్పంచులు.. ఆహ్వానించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి, రాంపల్లి గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు కరుణాకర్ రెడ్డి, మల్లయ్యతో పాటు పలువురు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌లో జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

కొండపాక మండల అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి రాష్ట్రాన్ని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కోరగా వెంటనే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి , సర్పంచ్​ వెంకటేశ్, గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచాల కనక రాములు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రణీత్ రెడ్డి, లింగా రావు, శశిధర్ రెడ్డి, సురేందర్ రావు, సుదర్శన్, సిద్ధులు, అడ్వకేట్ రాజు తదితరులు పాల్గొన్నారు.. 

మంత్రి ని కలిసిన తూప్రాన్, మనోహరాబాద్ మండల నాయకులు

తూప్రాన్ : మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామిని శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం లో తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన నాయకులు మహిపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మండలాలకు సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు  మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధర్మేందర్, శశిభుషణ్ తదితరులు ఉన్నారు.