అమెరికా- ఇజ్రాయోల్ దాడులు.. ఇరాన్ లో 787 మంది మృతి

 అమెరికా- ఇజ్రాయోల్ దాడులు.. ఇరాన్ లో  787 మంది మృతి

 ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయోల్  వార్ నాలుగో రోజుకు చేరింది. ఇరాన్ లో ఇప్పటి వరకు 787 మంది చనిపోయినట్లు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ తెలిపింది.  ఇరాన్ పై మరోసారి ఇజ్రాయోల్ భీకర దాడులుచేస్తోంది . ఇరాన్ సైన్యం స్థావరాలే లక్ష్యంగా  ఇజ్రాయోల్  దాడులు చేస్తోంది.  ఇరాన్ కూడా ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. 

పశ్చిమాసియా మంటల్లో చిక్కుకుంది. ఎక్కడ ఎప్పుడు బాంబు పడుతుందో తెలియని అయోమయ స్థితికి వెళ్లిపోయింది. గల్ఫ్ దేశాలు యుద్ధభయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక వైపు నుంచి డ్రోన్లు.. మరోవైపు నుంచి మిస్సైల్స్ దాడులతో ఏడారి దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఇరాన్ కు  చెందిన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం యూఏఈలోని దుబాయ్ లో అమెరికా బలగాలపై డ్రోన్లు, మిసైల్స్తో కంబైన్డ్ అటాక్ నిర్వహించినట్లు ప్రకటించింది. అదే సమయంలో కువైట్లోని అరిష్టాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ అటాక్ జరిగిందని వెల్లడించింది. 

►ALSO READ | భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది: పాక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

సౌదీ అరేబి యాలోని రియాద్ దౌత్య ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. రియాద్లోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లతో దాడి జరిగిందని సౌదీ అధికారులు ధ్రువీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెడ్డా, రియాద్, ధహ్రాన్ నగరాల్లో ఉన్న ఆమె రికన్ పౌరులు తక్షణమే ఇళ్లలోనే ఉండాలని అమెరికా ఎంబసీ సూచించింది. రియాద్లో ని ఎంబసీకి వెళ్లవద్దని, సైనిక స్థావరాల వైపు అవసరం లేని ప్రయాణాలు నివారించాలని హెచ్చరించింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్, దాని మిత్రబలగాలు గల్ఫ్ ప్రాంతమంతా దాడులను విస్తరించా యి. ఖతార్లోని ఆయిల్ స్టేషన్లు, సౌదీలోని అమెరికా ఎంబసీ సహా పలు లక్ష్యాలు దాడుల బారినపడ్డాయి.

మరో నాలుగైదు వారాలు యుద్ధం : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక "ఆపరేషన్లు నాలుగు నుంచి ఐదు వారాలు సాగే -అవకాశం ఉందని, అవసరమైతే మరింత కాలం కొనసాగుతాయని చెప్పారు. అమెరికా విదేశాంగ -మంత్రి మార్కో రుబియో "ఇంకా తీవ్ర దాడులు -మిగిలే ఉన్నాయి" అని హెచ్చరించారు. ఈ యుద్ధ -లక్ష్యాలు అతాస్ మిసైల్ సామర్థ్యాన్ని ధ్వంసం -చేయడం, నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడం, -అణ్వాయుధాల సాధనను డ్డుకోవడమేనని ట్రంప్ స్పష్టంచేశారు.