T20 World Cup: ఇండియా– ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముప్పు?.. అలా జరిగితే భారత్ ఇంటికే!

T20 World Cup: ఇండియా– ఇంగ్లాండ్ మ్యాచ్ కి ముప్పు?.. అలా జరిగితే భారత్ ఇంటికే!

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 తుది దశకు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్ వర్సెస్ -ఇంగ్లాండ్ మధ్య అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీన రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుండగా.. సెకండ్ సెమీస్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే ప్రారంభమైతుంది. కాగా ఈ మ్యాచ్ లకి వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత క్యాన్సిల్ అయితే.. పరిస్థితి ఏంట అనే దానిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా డిస్కషన్ చేసుకుంటున్నారు. 

వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్ లకి ఐసీసీ రిజర్వ్ డేని కూడా కేటాయిస్తుంది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేదా పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి తర్వాత రోజు మ్యాచ్ ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరగడం సాధ్యపడకపోతే మాత్రం సూపర్–-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన టీమ్ నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా క్యాన్సిల్ అయినా రద్దైతే, సూపర్–-8లో గ్రూప్-–1 టాపర్ గా కొనసాగుతున్న సౌతాఫ్రికా ఫైనల్ కి దూసుకెళ్తుంది.

►ALSO READ | Team India: ముంబైలో అడుగుపెట్టిన మెన్ ఇన్ బ్లూ.. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ క్లాష్

అలాగే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ సైతం ఏదైనా కారణంగా వాయిదా పడినా రద్దు అయినా, సూపర్-8లో గ్రూప్–-2 టాపర్ గా ఉన్నటు వంటి ఇంగ్లండ్ టీమ్ నేరుగా ఫైనల్ ఫైట్ లోకి అడుగు పెడుతుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ సేన ఈ మెగా టోర్నమెంట్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏదైనా కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.