Team India: టీ20 వరల్డ్ కప్ సూపర్–8 దశలో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఆరోజు ( సోమవారం) సాయంత్రం ముంబై చేరుకుంది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆటగాళ్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు బస్సు ఎక్కారు. ఫిబ్రవరి 5వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనున్నారు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆరోసారి సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. గత మూడు ఎడిషన్లలో (2022, 2024, 2026) వరుసగా ఇండియా సెమీస్ చేరడం విశేషం. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సాధించిన విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు అందరి దృష్టి ముంబైలో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌పైనే నెలకొంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో పోటీ పడుతున్నాయి. ఒకే ప్రత్యర్థితో వరుసగా మూడు సెమీఫైనల్స్ ఆడటం వరల్డ్ కప్ చరిత్రలో ఒక అరుదైన అంశంగా చెప్పాలి.. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు కూడా ఈక్వల్ గా ఉన్నాయి.
గత రెండు సెమీఫైనల్స్ ఫలితాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే, ఆ టీమ్ ఈ ఏడాది వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2022లో ఇంగ్లాండ్ గెలిచి ట్రోఫీ అందుకోగా, 2024లో భారత్ విజయం సాధించి టైటిల్ ని గెలుచుకుంది. ఇప్పటివరకు భారత్ (2007, 2024), ఇంగ్లాండ్ (2010, 2022) చెరో రెండు సార్లు పొట్టి కప్ ని సాధించుకున్నాయి. మార్చి 5వ తేదీన ముంబైలో గెలిచే జట్టు మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుందో లేదా అనేది చూడాలి.
VIDEO | ICC Men's T20 World Cup 2026: Indian Cricket team arrives at Mumbai airport.
— Press Trust of India (@PTI_News) March 2, 2026
India defeated the West Indies to secure a spot in the semifinals and will now take on England in Mumbai on March 5.
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/Bs89V79950
