మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ఖగోళ నిపుణులు చెబుతున్నారు. .మార్చి3న హైదరాబాద్‌లో కనిపించే చంద్రగ్రహణం పాక్షికంగా చివరి 27 నిమిషాలు దర్శనమిస్తుంది. చంద్రగ్రహణ సమయానికి 9 గంటలు మందుగా అంటే ఈ రోజు ( మార్చి 3) ఉదయం 6:22 గంటలకు సూతకాలం మొదలైంది. ఆ సమయం నుంచి ప్రభావం కొద్ది కొద్దిగా ప్రారంభమయిందని పండితులు చెబుతున్నారు.
శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు. అందుకే దీనిని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై...సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది.శాస్త్రాల ప్రకారం, చంద్రగ్రహణానికి 9 గంటల ముందే అంటే ఇప్పటికే ( వార్త పబ్లిష్ సమయానికి) సూతకాలం మొదలయింది.
ఇప్పటి నుంచి అప్పటి నుండి గ్రహణ నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు..చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే గీతలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అలా భూమి సూర్యుడు – చంద్రుడు మధ్యకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎటువంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని, కంటితోనే నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారతదేశంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలు అనేక ఆచారాలను పాటిస్తారు. ఆ సమయంలో ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని నమ్మకం ఉండటంతో, ఆ సమయంలో ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గర్భిణులు, శిశువులకు గ్రహణ ప్రభావం ఉంటుందని భావించి కొన్ని ఆంక్షలు పాటిస్తారు.
చంద్రగ్రహణం సమయంలో, రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్ముతారు. ఈసారి, పూర్వఫల్గుణి ( పుబ్బ) నక్షత్రంలో సింహ రాశిలో గ్రహణం సంభవిస్తుంది. గ్రహణం సమయంలో కేతువు చాలా బలంగా ఉండి.. నష్టం కలుగజేసే అవకాశాలున్నాయి. అందుకే గ్రహణం తరువాత శివలింగానికి జలాన్ని ( నీరు) సమర్పించాలి. ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేయాలి. దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు.
