ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను మన ఇంటి దగ్గర పండిస్తే ఎలా ఉంటుంది..? ఈ ఐడియా వినటానికి చాలా బాగుంది కదా. అవును మరి.. కిలో 2 నుంచి 3 లక్షల వరకు ఉండే మామిడి పండ్లను ఇంటి దగ్గర పండిస్తే ఆ థ్రిల్లే వేరు. ఇంత రేటా అనుకోకండి.. మియాజాకీ మామిడి అనే రకం ధర అంత ఉంటుంది మరి. వీటినే ఎగ్స్ ఆఫ్ ద సన్ అనిక కూడా పిలుస్తుంటారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను జపాన్ రైతులు పండిస్తున్నారు. మామూలుగా అయితే మన దగ్గర మామిడి పండ్లకు కిలో ధర రూ.80 నుంచి 120 దాకా ఉంటుంది. కానీ ఇవే పండ్లను మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైతులు పండిస్తున్నారు. చెందిన సంకల్ప్ విహార్ అనే రైతు తన పొలంలో విలువైన మియాజాకీ అనే జపాన్ మామిడి వెరైటీని పెంచుతున్నాడు. ఈ మామిడి కిలో ధర రూ.2.7 లక్షలు ఉంటుంది. ఒక్కో మామిడి పండు 400 గ్రాముల బరువు పెరుగుతుంది.
పెరట్లో పండించడం ఎలా..?
కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఒక రైతు.. ఈ మియాజాకీ పండ్లను ఇంటి పెరట్లో పండించి సక్సెస్ అయ్యాడు. అతిని పేరు జోసెఫ్ లోబో. ఇండియాలో మొదటి సారి ఇంటిదగ్గర పండించిన రైతుగా రికార్డుకెక్కాడు. నిరంతరం కేర్ తీసుకోవడం, అత్యంత పోషకాలతో కూడిన వివిధ రకాల మట్టిని సేకరించి పంటను పండించాడు. ఉష్ణమండల ప్రాంతంలో ఉండే వారు.. మంచి నేల, సూర్యరశ్మి, మంచి కేర్ తీసుకోగలిగితే పండించవచ్చునని చెబుతున్నాడు లోబో.
పెరట్లో పండించే టెక్నిక్స్:
అత్యంత ఖరీదైన మామిడి మొక్కను ఇంటి దగ్గర పెంచడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్పాడు లోబో. ఈ జపనీస్ మొక్కను పెంచేందుకు ఓపిక, సహనం ఉండాలి. పెరుగుతున్న ప్రతీ స్టేజ్ లో జాగ్రత్త పడాలని చెబుతున్నాడు. అదెలాగో ఆయన మాటల్లోనే చూద్దాం.
సరైన మొక్కను ఎంచుకోండి :
ఇంత కాస్ట్లీ మామిడిని పండించాలంటే.. విత్తనాలకు బదులుగా, ఆరోగ్యకరమైన మొక్కతో ప్రారంభించని లోబో చెబుతున్నాడు. మొక్క వేగంగా పెరగడానికి, దాని వేర్లు బలంగా ఉండటానికి విత్తనం కంటే మొక్క అయితేనే బాగు. వేర్లు విస్తరించడానికి పెద్ద కుండలు లేదా గ్రో బ్యాగులను ఉపయోగించండి.
►ALSO READ | రోజూ రెండు లవంగాలు నమిలితే.. ఎన్ని బెనిఫిట్సో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
పోషకాలు అధికంగా ఉండే మట్టి:
మొక్కలు పెరగడానికి సహాయపడే మిశ్రమాన్ని స్వయంగా తయారు చేయండి. లోబో సాధారణ మట్టిని స్వయంగా తయారు చేసుకున్నాడట. ఆవు పేడ, గొర్రె ఎరువు, పెరుగు, కూరగాయల వ్యర్థాలతో కలపాలని తెలిపాడు. మిశ్రమంలో 50% 50% మట్టితో కలపడం వల్ల పోషకాలతో నిండిన సమతుల్య మిశ్రమం ఏర్పడుతుంది .
జాగ్రత్తగా నాటాలి :
మట్టి మిశ్రమం, నారు సిద్ధమైన తర్వాత, నారును జాగ్రత్తగా గ్రో బ్యాగ్‌లో ఉంచండి. మామిడి చెట్లు బాగా పెరగడానికి చాలా సూర్యకాంతి అవసరం కాబట్టి మొక్కను ఎండ పడే ప్రదేశంలో ఉంచండి.
ఆ ప్రాంతాన్ని కెమికల్స్ లేకుండా ఉంచండి. మరొక ముఖ్య విషయం.. పురుగుమందులు లేదా రసాయన ఎరువులు వాడకండి. వేప నూనె, ఇతర సహజ ఉత్పత్తులు వాడితే బెటర్. చెట్టుకు హాని కలిగించే రసాయనాలను కలపకుండా పురుగులను దూరంగా ఉంచేందుకు వేపనూనె ఉపయోగపడుతుంది.
రెగ్యులర్ గా పోషకాలు, నీరు :
ప్రతి 30 రోజులకు ఒకసారి, తయారుచేసిన పోషకాల మిశ్రమాన్ని మొక్కకు ఇవ్వాలి. చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోసి పోషకాలు ఇస్తే, ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పండ్లు పండే వరకు వేచి ఉండండి :
మియాజాకి మామిడి చెట్టును ఎంత జాగ్రత్తగా పెంచినా.. కాతకు వచ్చి పండ్లు ఇచ్చే వరకు సమయం పడుతుంది. అందుకోసం ఓపికతో వేచి ఉండాలి. మియాజాకి మామిడి పండ్లు పండటానికి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని లోబో తెలిపాడు . ఇంత ఓపిక ఉంటే.. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయవచ్చు.
