కొడుకులు ఇంట్లోంచి గెంటేశారు..  న్యాయం చేయాలని వృద్ధ దంపతుల నిరసన

కొడుకులు ఇంట్లోంచి గెంటేశారు..  న్యాయం చేయాలని వృద్ధ దంపతుల నిరసన

సిద్దిపేట రూరల్, వెలుగు: తమ నుంచి ఆస్తిని రాయించుకుని తమను ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకుల నుండి తమకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. కోహెడ మండలం పెద్దసముద్రాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గ్రామానికి చెందిన జంగం మల్లయ్య–ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు కొడుకులు. తాము సంపాదించిన ఆస్తిని కొడుకులు పెద్ద, రెండో కొడుకులు జంగం యాదయ్య, కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజుకు సమానంగా భూమి రాసిచ్చారు.

అనంతరం పెద్దవారు ఇద్దరు తమను ఇంటి నుంచి వెళ్లగొట్టడడంతో ఏడాదిగా కిరాయి ఇళ్లలో బతుకుతున్నట్లు వాపోయారు. చిన్న కొడుకు రాజు వద్ద ఉండడానికి ప్రయత్నిస్తే, అతనిపై మిగతా ఇద్దరు దాడి చేశారన్నారు. కలెక్టర్ స్పందించి తమ భూమి తమకే తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.