2025వ సంవత్సరం ముగింపునకు వస్తున్న వేళ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ టాలీవుడ్‌లో అసలైన రారాజు ఎవరో తేల్చేశాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్దే కాదు.. డిజిటల్ దునియాలో కూడా 'పుష్పరాజ్' ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిరంతర చర్చలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గూగుల్ సెర్చ్‌లలో అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ స్థాయిలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించి, తన పాన్ ఇండియా క్రేజ్‌ను మరోసారి చాటుకున్నారు.
టాలీవుడ్ నెం.1 స్థానంలో అల్లు అర్జున్..
గూగుల్ తాజాగా విడుదల చేసిన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' గణాంకాల ప్రకారం, ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేయబడిన టాలీవుడ్ హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ స్థాయిలో రికార్డులు సృష్టించిన ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఆయన తన పాన్ ఇండియా ఇమేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారు . ఈ చిత్రం కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, నార్త్ బెల్ట్‌లో కూడా 1000 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డులను తిరగరాసింది.
టాప్ 5 మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోలు
గూగుల్ సెర్చ్ డేటా ఆధారంగా.. అల్లు అర్జున్ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘పుష్ప 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లుచేసి రికార్డులు సృష్టించింది. తర్వాత రెండో స్థానంలో ప్రభాస్ నిలిచారు. ‘ది రాజా సాబ్’ నుంచి వచ్చిన వింటేజ్ లుక్, ‘సలార్ 2’ వార్తలతో ప్రభాస్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. మూడోస్థానంలో మహేష్ నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి 'కోసం చేస్తున్న భారీ మేకోవర్ ఫోటోలు వైరల్ అవ్వడంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక టాప్ 4లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ‘OG’ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ , రాజకీయ అంశాలతో పవన్ కళ్యాణ్‌ను టాప్ 4లో ఉంచాయి. ఆతర్వాత 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ‘దేవర’ సక్సెస్, బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో ఆయన పోషిస్తున్న పాత్రపై ఉన్న ఆసక్తి వల్ల ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.
పుష్ప 2 - ఒక బాక్సాఫీస్ సునామీ!
దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప 2' ఒక సినిమాగా మొదలై, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక 'ఫినామినన్'గా నిలిచింది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లోనే ఏకంగా రూ. 812 కోట్ల నెట్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 2025లోనే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా ఇది నిలిచింది.
►ALSO READ | పశువుల్లా ఎక్కించడమేంటీ..! శంషాబాద్ ఎయిర్ పోర్టులో సినీ నటుడు నరేష్ గొడవ
‘తగ్గేదే లే’
అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఆయన డిజిటల్ సామ్రాజ్యం మరింత విస్తరించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వస్తున్న 'AA22' లో నటిస్తున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ , హై-యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. మరో వైపు త్రివిక్రమ్ ప్రాజెక్టు కూడా త్వరలో పట్టాలెక్కనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో పౌరాణిక, ఫ్యూచరిస్టిక్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి, బాక్సాఫీస్ నుంచి గూగుల్ సెర్చ్ వరకు 2025 సంవత్సరం పూర్తిగా అల్లు అర్జున్ నామస్మరణతోనే ముగిసింది.
