SL vs NZ: శ్రీలంక- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలక సూపర్-8 మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టాస్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు సహకారం ఉంటుందని భావించిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులను ఉపయోగించుకోవాలనే వ్యూహంతో ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. గత మ్యాచ్‌తో పోలిస్తే లంక జట్టులో ఒక మార్పు చేశారు. కమిల్ మిశారాను పక్కన పెట్టి చరిత్ అసలంకను తుది జట్టులోకి తీసుకున్నారు.
మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. జేమ్స్ నీషమ్ స్థానంలో కోల్ మెక్‌కాన్చీని తుది జట్లులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. గత మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం తీవ్ర నిరాశ కలిగించినా, ఈ మ్యాచ్‌కు ముందు మంచి ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొన్నారు. పిచ్ మంచిగా ఉంది, బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్:
టిమ్ సైఫర్ట్ (వికెట్‌కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కాన్చీ, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్
శ్రీలంక:
పథుమ్ నిశాంక, కుశల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, దుష్మంత చమీరా, మహీష్ తీక్షణ, దిల్షాన్ మధుశంక
