ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి.. ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. బుధవారం (ఫిబ్రవరి 25) తెల్ అవివ్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్టులో మోదీ ల్యాండ్ అయిన వెంటనే.. రెడ్ కార్పెట్ తో ఆయనను ఆహ్వానించారు. భార్య సార నెతన్యాహుతో కలిసి స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లిన నెతన్యాహు.. మోదీకి స్వాతం పలికారు.
బుధ, గురువారం (2026, ఫిబ్రవరి 25 నుంచి 26) రెండు రోజులు మోదీ ఇజ్రాయెల్ లో పర్యటిస్తారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ ట్రిప్ తోడ్పడుతుందని.. ఇజ్రాయెల్ వెళ్లే ముందు మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు.
ఇటీవలి కాలంలో ఇండియా, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు బలపడుతూ వస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. వివిధ అంశాల మధ్య చర్చించి కీలక రంగాలలో పరస్పర సహకారం మరింత పెంపొందించుకునేలా ఈ పర్యటన తోడ్పడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యటన వివరాలు:
9 ఏళ్ల తర్వాత ప్రధాని ఇజ్రాయెల్ లో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2017 లో పర్యటించిన మోదీ.. ఇజ్రాయెల్ పర్యటించిన తొలి ప్రధాని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
►ALSO READ | ఇద్దరు రష్యా మహిళలతో ఎఫైర్ ఉన్న మాట నిజం.. నన్ను క్షమించండి: బిల్ గేట్స్
బుధవారం సాయంత్రం 8 గంటలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ (Knesset) లో మోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. ఆ తర్వాత నెతన్యాహుతో స్పెషల్ డిన్నర్ ఉంటుంది.
ఇక గురువారం మధ్యాహ్నం 12.15 కు ఇజ్రాయెల్ మెమోరియల్ అయిన యాద్ వషెమ్ (Yad Vashem) ను సందర్శిస్తారు. నాజీల చేతిలో హతమైన ఆరు మిలియన్ల యూధులకు నివాళిగా1953 లో ఏర్పాటు చేశారు.
