ఇద్దరు రష్యా మహిళలతో ఎఫైర్ ఉన్న మాట నిజం.. నన్ను క్షమించండి: బిల్ గేట్స్

ఇద్దరు రష్యా మహిళలతో ఎఫైర్ ఉన్న మాట నిజం.. నన్ను క్షమించండి: బిల్ గేట్స్

ప్రపంచ వ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ రాజేసిన సెగలు ఇంకా ఆరటం లేదు. తవ్వేకొద్ది రహస్యాలు బయటపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు బడా వ్యాపారవేత్తలకు కూడా కూసాలు కదిలిపోతున్నాయి. ఈ రొంపిలో భాగమైన మైక్రోసాఫ్ట్ టెక్ దిగ్గజం బిల్ గేట్స్.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తన బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులకు ఈ అంశానికి సంబంధించి క్షమాపణలు చెప్పారు. 

ఇటీవల నిర్వహించిన ఇండియా ఏఐ సమిట్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న గేట్స్.. ఎప్ స్టీన్ వ్యవహారంపై స్పందించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఉన్నట్లుగా.. తనకు ఇద్దరు రష్యన్ యువతులతో అఫైర్ ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంలో ఫౌండేషన్ సభ్యులు, ఉద్యోగులు తనను క్షమించాలని కోరారు. 

ఫౌండేషన్ టౌన్ హాల్ మీటింగ్ సందర్భంగా.. ఉద్యోగులతో మాట్లాడిన గేట్స్.. ఎప్ స్టీన్ ఫైల్స్ లో మెన్షన్ చేసినట్లుగా ఇద్దరితో రిలేషన్షిప్ ఉన్నట్లు అంగీకరించారు. కానీ వాళ్లు ఎప్ స్టీన్ బాధితులు కారని పేర్కొన్నారు. 

గేట్స్ కు, ఎప్ స్టీన్ కు మధ్య పలుమార్లు జరిగిన మీటింగ్స్ కు సంబంధించి అమెరికా న్యాయశాఖ రికార్డ్స్, ఇమేజెస్ ను విడుదల చేసింది. మహిళలతో గేట్స్ ఫోటోలు దిగిన డాక్యుమెంట్లు కూడా ఆ ఫైల్స్ లో ఉన్నాయి. 

ఫౌండేషన్ అంతర్గత సమావేశంలో స్టాఫ్ తో మాట్లాడిన గేట్స్.. ఎప్ స్టీన్ తో సమయం కేటాయించడం.. ఆ మీటింగ్స్ లో ఫౌండేషన్ సీనియర్లు భాగస్వాములు చేయడం అతి పెద్ద తప్పు అని.. ఈ విషయంలో తనను అందరూ క్షమించాలని కోరారు. తన వల్ల ఈ వ్యవహారంలోకి వచ్చిన వారిని కూడా వేడుకుంటున్నట్లు గేట్స్ పేర్కొన్నారు. 

►ALSO READ | పాకిస్తానీయుల దాడులతో.. లండన్ లో 16 ఏళ్ల నాటి ఇండియా రెస్టారెంట్ మూసివేత

ఎప్ స్టీన్ చేసిన ఘోరాలలో తనకు భాగస్వామ్యం లేదన్నారు గేట్స్. అన్యాయంగా, అక్రమంగా ఎలాంటి అఘాయిత్యాలు చేయలేదని తెలిపారు. ఎప్ స్టీన్ బాధితులతో ఎప్పుడూ గడపలేదని.. అతని చుట్టూ ఉన్న మహిళతో గడపలేదని చెప్పారు. తనకు అంతకు ముందు నుంచే ఇద్దరు రష్యన్ యువతులతో ఎఫైర్ ఉందని.. వాళ్లు ఎప్ స్టీన్ తో తర్వాత చేరినట్లు తెలిపారు.  అయితే ఎప్ స్టీన్ కు, తమకు ఎలాంటి లావాదేవీల జరపలేదని గేట్స్ ఫైండేషన్ లో ప్రకటించింది.

ఎప్ స్టీన్ ఫైల్స్ ఆరోపణల తర్వాత..  ఫిబ్రవరి ఆరంభంలో జరిగినఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో తన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. టెక్నాలజీ , దాతృత్వంపై ఆయన హై-ప్రొఫైల్ ఈవెంట్‌లో గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఓపెన్AI CEO సామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ, ఇతర బిజినెస్ లీడర్స్ తోకలిసి ప్రసంగించాల్సి ఉండగా ఆయన అర్థంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే.

అయితే, గేట్స్ ప్రసంగించడానికి కొన్ని గంటల ముందు, ఆయన ఇకపై సమిట్ లో పాల్గొనబోరని గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది.  కీలక అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉందని.. అందుకే సమిట్ లో పాల్గొనరని  ఫౌండేషన్ తెలిపింది.