Shreyas Iyer: ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్న తరుణంలో.. బీసీసీఐ సెలెక్టర్లకు గట్టి సమాధానం చెప్పేందుకు శ్రేయస్ అయ్యర్‌కు మంచి ఛాన్స్ దక్కింది. కానీ అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. డీవై పాటిల్ టీ20 కప్ 2026లో శ్రేయాస్ గోల్డెన్ డక్‌గా ఔటై తీవ్ర నిరాశ కలిగించాడు. భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్ జట్టు కెప్టెన్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 3 ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు.. బాబీ యాదవ్ బౌలింగ్ లో తొలి బంతికే షాట్ ఆడిన అయ్యర్, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చాలా కాలంగా శ్రేయాస్‌ను ఇబ్బంది పెడుతున్న షార్ట్ బాల్‌కే వికెట్ పడింది. దీంతో టీ20 వరల్డ్ కప్ జట్టులో తనను ఎంపిక చేయనందుకు సరైన సమాధానం ఇవ్వాల్సింది పోయి.. ఈ విధంగా ఔట్ కావడంతో సెలెక్టర్ల నిర్ణయం కరెక్ట్ అనిపించేలా చేశాడు. అయితే తిలక్ వర్మ ఫామ్ లేక ఇబ్బంది పడుతుండటం, సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలతో.. అద్భుతంగా తుది జట్టులో అవకాశం దక్కించుకునేందుకు ట్రై చేయాల్సిన శ్రేయాస్ గోల్డెన్ డక్ కావడం తీవ్ర నిరాశకు గురి చేసింది.
►ALSO READ | Gautam Gambhir: వాళ్లిద్దరి మధ్య గంభీర్ గొడవ పెట్టాడు.. పిచ్చి కూతలు కూసిన పాక్ మాజీ క్రికెటర్
కాగా శ్రేయాస్ అయ్యర్ కు ఇది చివరి అవకాశం కాదు.. ఐపీఎల్ 2026 ప్రారంభమయ్యాక అతడు మళ్లీ బరిలోకి దిగనున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ జట్టును నడిపించనున్నాడు. గత సీజన్‌లో పంజాబ్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అద్భుతంగా రాణించాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 604 రన్స్ చేసి, 175కి పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 133 మ్యాచ్‌ల్లో 3,731 రన్స్ చేసి, సగటు 34.13తో నిలకడగా రాణిస్తున్నాడు.
ఇక శ్రేయస్ అయ్యర్ గాయాలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. గత అక్టోబర్‌లో భారత్– ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో అతడికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర నొప్పితో చికిత్స తీసుకున్న అయ్యర్, ఆ తర్వాత స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో నంబర్-4 స్థానంలో బ్యాటింగ్ చేసి 49 రన్స్ చేసి రీఎంట్రీ చేశాడు.
