Gautam Gambhir: వాళ్లిద్దరి మధ్య గంభీర్ గొడవ పెట్టాడు.. పిచ్చి కూతలు కూసిన పాక్ మాజీ క్రికెటర్

Gautam Gambhir: వాళ్లిద్దరి మధ్య గంభీర్ గొడవ పెట్టాడు.. పిచ్చి కూతలు కూసిన పాక్ మాజీ క్రికెటర్

Gautam Gambhir: టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో అదరగొట్టిన సూర్యసేన, కీలకమైన సూపర్-8 దశలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయి, తమ సెమీస్ అవకాశాలను మరింత జటిలం చేసుకుంది. సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలో భారత్ తప్పక గెలవాల్సిందే.. అంతేకాదు, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ప్రయోగం ఫలించలేదు.  

అద్భుతమైన ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ని కాదని వాషింగ్టన్ సుందర్ ని తుది జట్టులో అవకాశం కల్పించారు. సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఫెయిల్ అయ్యాడు. దీంతో గంభీర్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ హాట్ కామెంట్స్ చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి టీమ్ ని దెబ్బతీస్తోందని అన్నాడు.

గౌతమ్ గంభీర్ వ్యూహత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెజాద్ ఆరోపించారు. జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించాడు. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రోటీస్ జట్టుకి కలిసొచ్చింది.. ఐడైన్ మార్క్రామ్ లాంటి పార్ట్ టైమ్ బౌలర్ వికెట్ తీసి.. జట్టుపై ఒత్తిడిని పెంచిందన్నాడు. టీమిండియా వద్ద చాలా అప్షన్స్ ఉన్నాయి.. అద్భుతమైన ప్లేయర్స్ కూడా ఉన్నారు.. కానీ గంభీర్ సరిగ్గా ఆటగాళ్లను కరెక్టుగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని పాక్ మాజీ క్రికెటర్ విమర్శించాడు.

►ALSO READ | T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్.. 

కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి మ్యాచ్ విన్నర్లను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెజాద్ వెల్లడించారు. పాక్ తో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ ని సూర్య వెనక్కి నెట్టివేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది.. బహుశా సూర్యతో గొడవ వల్లే కుల్ దీప్ ని జట్టు నుంచి తప్పించారని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. లేకుంటే, కుల్దీప్ లాంటి అద్భుతమై స్పిన్నర్ ని పక్కన పెట్టటం ఏంటని ప్రశ్నించాడు. గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో అతడి ఆలోచనా మొత్తం మారింది.. ఇప్పుడు అదే తరహాలో క్రికెట్ లో పాలిటిక్స్ చేస్తున్నాడని పాక్ క్రికెటర్ అహ్మద్ ఆరోపించాడు.