T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకూ సెమీఫైనల్ వెళ్లే అవకాశాలను నిర్ణయించనుంది.
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. పిచ్ బాగుంది.. ముందుగా బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ నమోదు చేసి, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ టోర్నీలో పల్లెకెలేలో ఆడటం మాకు తొలి మ్యాచ్, శ్రీలంకలోని పరిస్థితులు పెద్దగా మారవు.. మా స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ బలంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్ లో ఫహీమ్ అష్రఫ్‌ను తప్పించి, షాహీన్ అఫ్రిదిని మళ్లీ జట్టులోకి తీసుకున్నామని వెల్లడించాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. టాస్ మేము గెలిస్తే బ్యాటింగ్‌నే ఎంచుకునేవాళ్లం.. రెండు రోజుల క్రితం ఆడిన పిచ్‌తో పోలిస్తే ఇది మెరుగ్గా ఉంటుంది.. మేము జట్టులో మార్పులు చేయలేదు.. టీం ఆత్మవిశ్వాసం ఉంది.. సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకం.. కానీ టీ20లో ఒక్క ఓవర్‌నే మ్యాచ్ దిశను మార్చేస్తుంది.. అందుకే మా ప్రణాళికలకు కట్టుబడి ఆడతామని బ్రూక్ తెలిపాడు.
►ALOS READ | Ravi Shastri: భారత్ జట్టులో మార్పులు చేయాల్సిందే.. లేకపోతే సెమీస్కి వెళ్లడం కష్టమే!
ఇంగ్లాండ్:
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
పాకిస్తాన్:
సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్.
