- ఏఐ ఆటోమేషన్ తో భారీగా ఉద్యోగాల కోత
- దేశంలో ఆర్థిక అస్థిరత తలెత్తే ప్రమాదం
- రూపాయి విలువ భారీగా పడిపోవచ్చని అంచనా
- హాట్ టాపిక్ గా మారిన సిట్రినీ రిసెర్చ్ నివేదిక
2028 నాటికి భారత్ తీవ్ర నిరు ద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని సిట్రినీ రిసెర్చ్ విడుదల చేసిన నివేదిక హెచ్చ రించింది. కృత్రిమ మేధ వేగవం తమైన విస్తరణతో ఐటీ రంగం నిర్మాణాత్మకంగా దెబ్బతింటుం దని విశ్లేషించింది. ఏఐ కోడింగ్ ఏజెంట్ల ఖర్చు కేవలం విద్యుత్ ఖర్చుకు సమానంగా మారడంతో భారత్కు చెందిన ఐటీ సేవలపై ఆధారపడే అంతర్జాతీయ సంస్థలు ఒప్పం దాలు రద్దు చేసుకునే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో టీసీఎస్, ఇన్ఫో సిస్, విప్రో పంటి దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాల కోత భారీగా ఉండొచ్చని అంచనా వేసింది.
ఉద్యోగాల నష్టం వల్ల వినియోగం తగ్గి, ఆర్థిక చక్రం బలహీనపడే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది. సేవల మిగులు క్షీణిం చడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగి, రూపాయి విలువ డాలర్తో పోల్చితే భారీగా పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇది అంచనా కాదని, ప్రస్తుత ఏఐ విస్తరణ కొన సాగితే ఎదురయ్యే ఒక భవిష్యత్ దృశ్యమని సిట్రినీ రిసెర్చ్ స్పష్టం చేసింది. ఏఐ కోడింగ్ ఏజెంట్లు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో, ఏటా 200 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు చేసే భారత ఐటీ సేవల రంగం స్థంభించవచ్చని అంచనా వేసింది.
►ALSO READ | ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' ఇక భారత్ సొంతం.. మోదీ పర్యటనలో చారిత్రక నిర్ణయం
అమెరికన్ డెవలపర్లతో పోలిస్తే తక్కువ ఖర్చే భారత ఐటీ బలమని, కానీ ఏఐ ఏజెంట్ల ఖర్చు కరెంటు ఖర్చుకే పరిమితమవడం తో ఆ మోడల్ పూర్తిగా దెబ్బతింటుందని తెలిపింది. నాలుగు నెలల్లోనే రూపాయి డాలర్తో తో పోలిస్తే 18 శాతం పడిపోయే అవ కాశముందని నివేదిక అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో 2028 తొలి త్రైమాసికంలో అం తర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రాథమిక చర్చలు ప్రారంభించే స్థితి రావచ్చని పేర్కొంది. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారు ఖర్చులు తగ్గించడంతో డిమాండ్ పడిపోతుందని తెలిపింది.
కంపెనీలు ఉద్యోగాల కోతలతో ఆదా అయిన నిధులను మళ్లీ ఏఐలోనే పె ట్టుబడులుగా మళ్లిస్తుండటంతో, ఖర్చుల కోత.. ఏఐ పెట్టుబడులు..మరిన్ని కోతలు అనే నియంత్రణలేని చక్రంలో ఆర్ధిక వ్యవస్థ చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించిం ది. ఏఐ మౌలిక వసతులపై అధిక ఆధారప డిన తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ ధోరణి వల్ల ఆర్థికంగా లాభపడతాయని నివేదిక స్పష్టం చేసింది.
