Naga Chaitanya: రగ్గడ్ లుక్‌లో అక్కినేని వారసుడు.. 'వృషకర్మ' ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్!.

Naga Chaitanya: రగ్గడ్ లుక్‌లో అక్కినేని వారసుడు.. 'వృషకర్మ' ఫస్ట్ గ్లింప్స్ డేట్ ఫిక్స్!.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య అక్కినేని, మీనాక్షి చౌదరి  జంటగా నటిస్తున్న చిత్రం  'వృషకర్మ' (Vrushakarma).  'తండేల్' సినిమా ఘనవిజయం తర్వాత చైతు తన కెరీర్‌లోనే అత్యంత భారీ మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'విరూపాక్ష' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కార్తీక్ దండు ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

 పీరియడ్ బ్యాక్‌డ్రాప్ లో.. 

నాగచైతన్య మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రాన్ని ఏకంగా 120 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ,  సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'విరూపాక్ష' తరహాలోనే ఇది కూడా ప్రేక్షకులను ఒక గూస్‌బంప్స్ కలిగించే రహస్య ప్రపంచంలోకి తీసుకెళ్తుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

గ్లింప్స్ కోసం ముహూర్తం ఫిక్స్!

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే, చిత్ర బృందం మార్చి 5, 2026న సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ పోస్టర్ లో  నాగ చైతన్య మునుపెన్నడూ చూడని విధంగా చాలా రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.. త్వరలో రిలీజ్ చేసే గ్లింప్స్ ద్వారా చిత్రంలోని మిస్టికల్ ప్రపంచాన్ని (Mystical World) పరిచయం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

►ALSO READ | With Love OTT Release: ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

ఆకట్టుకునే స్టార్ కాస్ట్

ఈ సినిమాలో చైతన్య సరసన క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. మరో విశేషమేమిటంటే, 'లాపతా లేడీస్' చిత్రంతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నారు. చైతన్య, స్పర్శ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్. 'కాంతార', 'విరూపాక్ష' వంటి చిత్రాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ దండు మార్క్ స్క్రీన్ ప్లే, అజనీష్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సహకారం అందించడం సినిమాపై నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది.