బాక్సాఫీస్ ఫ్లాప్ సినిమా.. యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ కొట్టిన.. తొలి మూవీగా ప్రపంచ రికార్డు !

బాక్సాఫీస్ ఫ్లాప్ సినిమా..   యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ కొట్టిన.. తొలి మూవీగా ప్రపంచ రికార్డు !

ప్రపంచ సినీ ప్రస్థానంలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డును ఒక తెలుగు సినిమాతిరగరాసింది. అందులో బాక్సాఫీస్ ఫ్లాప్ సినిమా.. 9 ఏళ్ల పాత సినిమా ఈ హిస్టరీ క్రియేట్ చేయడం వరల్డ్ వైడ్ గా మూవీ మేకర్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతే కదా.. ఒక ఫ్లాప్ సినిమా.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాల రుచి చూపిన సినిమా.. తొమిదేళ్లలో యూట్యూబ్ లో వంద కోట్ల మంది సినిమాగా రికార్డు సృష్టించడం గొప్పేకదా .

2017లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ నష్టపోయిన చిత్రం ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూంకార్’ యూట్యూబ్‌లో 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ అందుకోవడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించింది.పెన్ మూవీస్ ఛానల్ ద్వారా 2019లో అప్‌లోడ్ చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పుడు 1 బిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి, ప్రపంచంలోనే మొదటి సినిమాగా ఈ మైలురాయిని అందుకుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.1 బిలియన్ వ్యూస్. 1000 మిలియన్ లవ్ సింబల్స్. 100 కోట్ల వ్యూవర్స్ భావాలు.. ఒక సినిమా. ఈ అద్భుత మైలురాయిని సాధించిన ప్రపంచంలోనే మొదటి చిత్రం ఇది. జయ జానకి నాయక (ఖూంఖార్)ను ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విజయం మీ అందరిది అంటూ  బోయపాటి శ్రీను పోస్ట్ చేశారు.

సినిమా వివరాలు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, తరుణ్ అరోరా, ప్రగ్యా జైశ్వాల్ తదితరులు నటించారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామా జానర్‌లో తీసిన ఈ చిత్రం థియేటర్లలో ఘోరంగా నష్టపోయింది. సుమారు 40 కోట్ల బడ్జెట్‌తో తీసిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు కలిగించింది.

►ALSO READ | SS Rajamouli: సినిమా పుట్టిన గడ్డపై జెండా పాతిన జక్కన్న.. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన స్థానం

అయితే యూట్యూబ్‌లో మాత్రం ఈ సినిమా కొత్త ప్రేక్షకులను చేరుకుంది. హిందీ డబ్బింగ్ ద్వారా ఉత్తర భారత ప్రేక్షకుల్లో మంచి స్పందన సాధించింది. బోయపాటి శ్రీను ఇటీవల అఖండ 2  ద్వారా బాలకృష్ణతో పని చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హిందీ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.ఈ మూవీ సక్సెస్ తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్లకు యూట్యూబ్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మరోసారి స్పష్టమైంది. అల్లు అర్జున్ సరైనోడు వంటి సినిమాలు కూడా యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాధించాయి.