పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం.. మాజీ ఉన్నతాధికారులకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు తొలగింపు.

పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం.. మాజీ ఉన్నతాధికారులకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు తొలగింపు.

తెలంగాణ పోలీస్ శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ లతో పాటు ప్రస్తుతం కీలక పోస్ట్ లలో  ఉన్న  పోలీస్ అధికారులకు  బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం (జులై 02)  ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నిర్ణయంతో మాజీ పోలీస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించనున్నారు. 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ అధికారులకు ఆ వాహనాలు కట్:

మాజీ డీజీపీలు  స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డీటి నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ మొదలైన అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

►ALSO READ | స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి.. వాట్సాప్ ద్వారా లొకేషన్.. ఏడాదికి రూ.5 కోట్ల బిజినెస్ గుట్టు రట్టు

మాజీ అధికారులతో పాటు ప్రస్తుత అధికారులకు కూడా ఈ నిర్ణయం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తీసివేశారు. మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం తీసివేసింది పోలీస్ శాఖ.

పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు ఉన్న గన్ మెన్ ల  సంఖ్య తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలావరకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ లకే  పరిమితం చేసింది.