యాదగిరిగుట్టపై ఆ మహిళ మృతితో.. ఆలయం మూసివేత

యాదగిరిగుట్టపై ఆ మహిళ మృతితో.. ఆలయం మూసివేత

హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కొండపై ప్రమాదం జరిగింది. పుష్కరిణి సమీపంలో కారు ఢీకొని యాచకురాలు మృతి చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాచకురాలు మృతి చెందడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం మళ్లీ దర్శనాలను ప్రారంభించనున్నారు అధికారులు.