నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్.. విత్తనాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్.. విత్తనాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. విత్తనాభివృద్ధి కార్పొరేషన్ లో  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం (జూలై 2) TGPSC  నుంచి విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్  సీడ్  అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఖాళీగా ఉన్న సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూలై 7 నుంచి  ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 19. పూర్తి వివరాల కోసం TGPSC అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. 

ALSO READ : ఉద్యోగాల జాతర: 11 ప్రభుత్వ బ్యాంకుల్లో 6,715 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

మొత్తం ఖాళీలు -19.
ఏజ్ లిమిట్ విషయానికి వస్తే..  జూలై 1 , 2026 నాటికి అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 44 ఏళ్లు నిండకూడదు. 
సెలెక్ట్ అయిన అభ్యర్థులక నెలకు రూ. 51వేల 320 నుంచి 1లక్షా 27 వేల 310 వరకు జీతం లభిస్తుంది. 
విద్యార్హతలు, సిలబస్, ఎంపిక విధానం ,ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను  https://www.tgpsc.gov.in/  చూడవచ్చు.