మొబైల్ నెంబర్ హైడ్ చేసి.. కేవలం యూజర్ నేమ్ ద్వారానే యూజ్ చేసే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే యూజర్ నేమ్ ద్వారా ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం మెటాకు నోటీసులు పంపింది. కొన్నాళ్లు ఈ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టింది. అయితే ఇప్పుడు వాట్సాప్ మాత్రమే కాకుండా మరిన్ని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై దాని పేరెంట్ కంపెనీ మెటా కి నోటీసు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లపై కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఈ యాప్‌లలోని యూజర్‌నేమ్ ఫీచర్‌పై త్వరలో నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల ఇంపర్సనేషన్ (వ్యక్తులను అనుకరించడం), ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కాములు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రారంభించకుండా నిలిపివేయాలని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెటాకు ఇప్పటికే నోటీసు ఇచ్చింది . ఇదే విధంగా టెలిగ్రామ్, సిగ్నల్ నుంచి కూడా భద్రతా ప్రమాణాలు, యూజర్ గుర్తింపు విధానాలు, మిస్ యూజ్ అయ్యే అవకాశాలపై వివరణ కోరనుంది.
ఎందుకు ఈ నిర్ణయం?
యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్ షేర్ చేయకుండానే సందేశాలు పంపవచ్చు. ఇది ప్రైవసీని పెంచుతుందని యాప్‌లు చెబుతున్నా, దీన్ని దుర్వినియోగం చేసి మోసాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలను ఫాలో అవుతూ మోసాలు జరగవచ్చని ప్రభుత్వం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఫీచర్ ఇంకా లైవ్ కాలేదని, ఈ ఏడాది చివర్లో నెమ్మదిగా అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. ఇంపర్సనేషన్‌ను అడ్డుకోవడానికి అనేక సేఫ్‌గార్డ్స్ ఉంచామని వాట్సాప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు ఫీచర్‌ను రోల్ అవుట్ చేయవద్దని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.
భారతదేశం వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్ కావడం, 50 కోట్లకు పైగా యూజర్లు ఉండటం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫీచర్ సైబర్ నేరాలను పెంచే అవకాశం ఉంటే IT Act కింద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
