కొత్త సామ్ సంగ్ ఫోన్.. తీసుకుని నెల కూడా కాలేదు. స్క్రీన్ గార్డ్ పై ఉన్న కవర్ కూడా ఇంకా ఊడిపోలేదు. కానీ అప్పుడే పేలిపోయింది. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనలో రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బట్టలు కాలిపోయాయి. కొత్త ఫోన్ పేలిపోవడంపై సామ్ సంగ్ కస్టమర్స్ లో ఆందోళన నెలకొంది.
మాజిద్ అనే వ్యక్తి ఒక పనిమీద ఘజియాబాద్ వెళ్లి.. తన గ్రామం దన్ కౌర్ కు తిరిగి వస్తుండగా.. సడన్ గా పేలిపోయినట్లు చెబుతున్నాడు. ఫోన్ వాడలేదని.. నెట్ ఆపేసి జేబులు వేసుకున్నట్లు చెప్పాడు. గంటలు గంటలు గేమ్స్ ఆడితేనో.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడితేనో ఫోల్ పేలిన ఘటనలు కోకొల్లలు. అలా చేస్తే పేలుతుందని కంపెనీ కూడా చెబుతుంటుంది. కానీ ఇవేవీ చేయకుండా జేబులో ఉన్న ఫోన్ సడెన్ గా వేడెక్కి పేలటమేంటని ఆందోళన వ్యక్తం చేశాడు.
ప్యాంటు జేబులో ఉన్న ఫోన్..ఉన్నట్లుండి వేడెక్కినట్లు చెప్పాడు. క్షణాల్లోనే జేబులోంచి పొగ వచ్చిందట. వెంటనే బయటకు తీస్తుండగానే క్షణాల్లోనే పేలిపోయినట్లు మాజిద్ చెప్పాడు. పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోవడంతో.. బట్టలు కాలిపోయాయని.. చేతులకు, తొడకు గాయలయ్యాయని పేర్కొన్నాడు.
ఎందుకు పేలి ఉంటుంది..?
ఫోన్ లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ డ్యామేజ్ అయి ఉండటం లేదా.. ఇంటర్నల్ గా తయారీ సమయంలో దోషం ఉండటం కారణంగా ఫోన్ డ్యామేజ్ అయి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
హీట్ అవుతున్న ఫోన్ జేబులో పెట్టుకోవడం డేంజర్:
ఈ ఇన్సిడెంట్ పై నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. ఫోన్ హీట్ అవుతున్నట్లు గమనిస్తే జేబులో పెట్టుకోవడం మంచిది కాదని సూచించారు. ఉన్నట్లుండి వేడి కావడం, ఉబ్బడం, పొగ రావడం, స్మెల్ రావడం లాంటివి జరిగితే లైట్ తీసుకోవద్దు అని చెబుతున్నారు.
అలాంటి ఫోన్ ను వాడటం మానేసి.. స్విచ్ ఆఫ్ చేసి.. స్టోర్ లో చెక్ చేయించాల్సిందిగా సూచిస్తున్నారు. అదే విధంగా ఫోన్ తో పాటు వచ్చిన ఛార్జర్ నే వాడాలని.. వేరే ఛార్జర్ వాడకం వలన కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
