మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఏదీ డిలీట్ చేయకుండా స్టోరేజ్ పెంచుకునే సీక్రెట్ ట్రిక్స్ ఇవే !

మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఏదీ డిలీట్ చేయకుండా స్టోరేజ్ పెంచుకునే సీక్రెట్ ట్రిక్స్ ఇవే !

స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్యల్లో 'స్టోరేజ్ ఫుల్' అని నోటిఫికేషన్ రావడం. ఫోన్‌లో స్టోరేజ్  నిండిపోతే కొత్త యాప్స్, ఫోటోలు లేదా వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడం కష్టమే కాకుండా, ఫోన్ పర్ఫార్మెన్స్  తగ్గి  స్లో అవుతుంది. అయితే మీ ఫోన్లో ఏదైనా డిలీట్ చేసే ముందు, మీ ఫోన్‌లో ఏ ఫైళ్లు లేదా యాప్స్ ఎక్కువగా స్టోరేజ్  ఆక్రమిస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

ఇందుకు ముందుగా మీ ఫోన్‌లో Settings > Storage విభాగానికి వెళ్లండి. అక్కడ ఫోటోలు, వీడియోలు, యాప్స్, డౌన్‌లోడ్స్ మొదలైనవాటిలో ఏది ఎంత MB/GB నిండిందో  స్పష్టంగా చూపిస్తుంది.

నిమిషాల్లో స్టోరేజ్ ఖాళీ చేసే పద్ధతులు:
1.మొదట  'స్మార్ట్ స్టోరేజ్' (Smart Storage) ఆన్ చేసుకోండి
మీ ఫోటోలు, వీడియోలు గూగుల్ ఫోటోస్ (Google Photos) లో ఇప్పటికే బ్యాకప్ అయి ఉంటే, వాటి ఒరిజినల్ కాపీలను ఫోన్ లోకల్ మెమరీ నుండి ఆటోమేటిక్‌గా డిలేట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఎలా ఆన్ చేయాలంటే ?:  Settings > Storage > Free Up Space > మెనూ పై ట్యాప్ చేసి Smart Storage ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి.

2. అనవసరమైన ఫైల్స్ & డౌన్‌లోడ్స్ 
యూట్యూబ్, గూగుల్ టీవీ లేదా ఇతర యాప్‌లలో డౌన్‌లోడ్ చేసిన వీడియోలు, పాటలు ఫోన్ మెమరీని త్వరగా నింపేస్తాయి.
ఇందుకు Google TV: App తెరిచి > Library > Downloaded Videos పై క్లిక్ చేసి Remove అని సెలెక్ట్ చేయండి.

YouTube Music: App తెరిచి > Library > సాంగ్స్ లేదా ఆల్బమ్ పక్కన ఉన్న More క్లిక్ చేసి Remove Download నొక్కండి.

పెద్ద ఫైళ్లు డిలీట్ చేయడానికి: Settings > Storage > Free Up Space > కావలసిన ఫైళ్లను సెలెక్ట్ చేసి Move to Trash నొక్కండి.

3. వాడని యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ &  Cache క్లియర్  
అన్-ఇన్‌స్టాల్: మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండి, తక్కువగా  లేదా అసలు వాడని యాప్‌లను డిలీట్ చేయండి.

Cache క్లియర్ చేయడం: యాప్‌లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల తాత్కాలిక 'Cache data' పేరుకుపోతుంది. ఇందుకు Settings > Apps కి వెళ్ళి, ఒక్కో యాప్‌ను క్లిక్ చేసి  Clear Cache కొడితే ఎలాంటి ముఖ్యమైన డేటా పోకుండానే కొంత స్పేస్ ఫ్రీగా  ఖాళీ అవుతుంది.

4. ఉపయోగించని యాప్స్ Archive చేయండి
యాప్‌ను పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్ చేస్తే అందులోని పర్సనల్   డేటా పోతుందని భయపడితే, 'Archive' ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనివల్ల యాప్ సైజ్ తగ్గిపోయి స్టోరేజ్ save అవుతుంది. కానీ మీ డేటా, యాప్ ఐకాన్ ఫోన్‌లోనే ఉంటాయి. మళ్లీ కావాలనుకున్నప్పుడు సింగిల్ ట్యాప్‌తో ప్లే స్టోర్ నుండి రీ-ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఎలా చేయాలి ?: Google Play Store తెరిచి > Profile ఐకాన్ నొక్కండి > Settings > General కి వెళ్ళి Automatically Archive Apps ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి.

5. డౌన్‌లోడ్స్  ఫోల్డర్ క్లీన్ చేయండి
మనం రోజు ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే PDFలు, ఇమేజెస్, డాక్యుమెంట్లు 'Downloads' ఫోల్డర్‌లో పేరుకుపోతాయి. మీ ఫోన్‌లోని Files లేదా Files by Google యాప్ ఓపెన్ చేసి, Downloads ఫోల్డర్‌ను చెక్ చేయండి. ఇకపై మీకు అవసరం లేని పాత ఫైళ్లను సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి.