పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉత్పత్తి నిలిపివేశారు అధికారులు. 2026 సెప్టెంబర్ 27వ తేదీన ప్లాంట్ ను షట్ డౌన్ చేశారు.
కర్మాగారం మరమ్మతులు చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆర్ఎఫ్ సిఎల్ యాజమాన్యం, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
రామగుండం కర్మాగారానికి రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) , గెయిల్ (GAIL) వంటి సంస్థల భాగస్వామ్యం ఉంది.
