రోజు ఉరుకుల పరుగుల జీవితం, బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు.. మనసు ఏదైనా అందమైన ప్రదేశానికి రెక్కలు కట్టుకుని వెళ్లాలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి, కుటుంబంతో కలిసి మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడానికి ట్రావెలింగ్ ఒక అద్భుతమైన మార్గం. ఈ జులై నెలలో మీ సమ్మర్/ట్రావెల్ ప్లాన్స్ ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు, భారతదేశంలో ప్రకృతి అందాలకు నెలవులైన కొన్ని బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ మీకోసం ఎదురుచూస్తున్నాయి. పచ్చని పర్వతాలు, రంగురంగుల పూల లోయలు, సాహసోపేతమైన రాతి కొండలు, మంచు తెరల మధ్య సాగే ప్రయాణం.. ఇలా మీ ట్రిప్‌ను లైఫ్ టైమ్ మెమరీగా మార్చే టాప్ అద్భుతమైన పర్యాటక ప్రాంతాల విశేషాలు ఇప్పుడు చూద్దాం!
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
మన దేశం నుంచి యునెస్కో గుర్తించిన టూరిస్ట్ అండ్ హిస్టారికల్ ప్లేస్ 'వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్'. ఉత్తరాఖండ్లోని చమోలి-పితోర్ గఢ్ మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్లేందుకు జులై నెల బెస్ట్. సముద్రమట్టానికి 3.858 మీటర్ల ఎత్తులో.. అందమైన పర్వతాలు, పూల తోటలతో ఆహ్లాదాన్ని పంచుతుంది 'వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్'. హేమకుంట సాహిబ్, భీమ్ పూల్, సరస్వతి నది వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. ట్రెక్కింగ్ కు వెళ్లాలనుకునేవాళ్లకు కూడా బెస్ట్ ప్లేస్. పర్వతాలపై పచ్చగా ఎదిగిన పూలమొక్కల మధ్య ట్రెక్కింగ్ చేయడం మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ నెలలో విరబూసే రంగురంగుల పూలను చూస్తూ సేదతీరొచ్చు. డెహ్రాడూన్, హరిద్వార్ నుంచి విమానంలో కాని, రైల్లో కాని చేరుకోవచ్చు. హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
స్పితి వ్యాలీ
అందమైన రాతి పర్వతాలు, వాటి మధ్యలోంచి పారే మంచు నదులు.. స్పితి వ్యాలీ ప్రత్యేకత. పర్వత ప్రాంతాల్ని ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతుంది కనుక దీన్ని 'మక్కా ఆఫ్ మౌంటైన్ లవర్స్' అని కూడా పిలుస్తారు. బుద్ధిజానికి సంబంధించిన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కల్చర్ ని ప్రతిబింబించే చిన్న టెంపుల్స్, గ్రామాలు ఉన్నాయి. రాతి పర్వతాల్ని చీలుస్తూ వేసిన రోడ్లపై ప్రయాణం అడ్వెంచరస్ గా అనిపిస్తుంది. 'కీమానస్టరీ, టాబో మానస్టరీ, బారా-షిగ్రీ గ్లేసియర్ వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. జీప్ సఫారి, ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్లేస్ ఇది. ఈ నెలలో టూరిస్ట్లు వెళ్లగలిగే మంచి స్పాట్ ఇది. కుల్లూ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సదుపాయం ఉంది. సిమ్లా రైల్వే స్టేషన్ నుంచి కూడా చేరుకోవచ్చు.
►ALSO READ | బ్లడ్ తక్కువగా ఉందా ? నీరసంగా అనిపిస్తోందా ? ఇమ్యూనిటీ పెంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే!
షిల్లాంగ్
ఈ నెలలో విజిట్ చేయాల్సిన మరో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ షిల్లాంగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈశాన్య భారతదేశంలోని అందమైన ప్రదేశాల్లో ఒకటి. చుట్టూ చిన్న చిన్న పర్వతాలు, సరస్సులతో నేచర్ లవర్స్ క్సు ఆహ్లాదాన్ని అందిస్తుంది షిల్లాంగ్. ఇది ఒక హిల్ స్టేషన్. పచ్చని ప్రకృతితో ఆకట్టుకునే ప్రదేశాల్లో వాకింగ్ చేస్తూ సేదతీరొచ్చు. నొకలికాయ్ ఫాల్స్, డాన్ బాస్కో మ్యూజియమ్, ఉమియమ్ లేక్, ఎలిఫెంట్ ఫాల్స్ తోపాటు వ్యూ పాయింట్ వంటి ఎన్నో ఆకట్టుకునే ప్రదేశాలున్నాయి. గౌహతి రైల్వే స్టేషన్ తో పాటు చెన్నై. అహ్మదాబాద్, ఢిల్లీ నుంచి ఫ్లైట్స్ ద్వారా వెళ్లొచ్చు.
గుల్ మార్గ్
జులైలో మంచు ప్రదేశాల్ని చూడాలనుకుంటే తప్పకుండా కాశ్మీర్లోని గుల్ మార్గ్ వెళ్లాల్సిందే. కొంచెం ఎండ.. తక్కువ టెంపరేచర్తో మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచరస్ స్పోర్ట్ అయిన స్కీయింగ్కు కూడా ఫేమస్ ఇది. మంచు కరిగి పారుతున్న నదిని దగ్గరగా చూస్తూ, పర్వతాల నుంచి చల్లగా వీచే గాలి స్పర్శను అనుభూతి చెందుతూ గుల్ మార్గ్ విజిట్ ను మెమొరబుల్గా మార్చుకోవచ్చు. ఖిలాన్మార్గ్, అల్పతార్ లేక్ వంటి మరెన్నో ప్లేసెస్ కూడా చూడొచ్చు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.
