బ్లడ్ తక్కువగా ఉందా ? నీరసంగా అనిపిస్తోందా ? ఇమ్యూనిటీ పెంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే!

బ్లడ్ తక్కువగా ఉందా ? నీరసంగా అనిపిస్తోందా ? ఇమ్యూనిటీ పెంచే  ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే!

మన ఒంట్లో రోగనిరోధక శక్తి (immunity) పెరగాలన్నా, నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉండాలన్నా మనం తినే ఆహారంలో 'ఐరన్' (iron) కచ్చితంగా ఉండాలి. ఐరన్ లోపిస్తే రక్తహీనత ( Anemia) వచ్చి బాడీ వీక్ అయిపోతుంది. మరి రూపాయి ఖర్చు లేకుండా మన చుట్టుపక్కల దొరికే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో చూసేయండి:

ఆకుకూరల రారాజు పాలకూర: మనకు ఈజీగా దొరికే పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్‌లో హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఐరన్‌తో పాటు విటమిన్ సి, ఫాస్పరస్, క్యాల్షియం, సోడియం వంటి పోషకాలు కూడా ఎక్కువే.

ALSO READ : Health news:మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఐరన్ లోపం కారణం కావచ్చు!..

టేస్టీ డార్క్ చాక్లెట్: చాక్లెట్ ప్రియులకు  డార్క్ చాక్లెట్ తినడం వల్ల బాడీకి ఐరన్‌తో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి.

సూపర్ డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, ఖర్జూరం లాంటి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఐరన్ ఖజానాలే. వీటిని రోజూ డైట్‌లో చేర్చుకుంటే బ్లడ్ సెల్స్ పెరిగి, హిమోగ్లోబిన్ లెవెల్స్ సూపర్‌గా ఇంప్రూవ్ అవుతాయి. ఐరన్ టాబ్లెట్లు వాడేకంటే, ఇలా నాచురల్ ఫుడ్స్‌తోనే మీ బ్లడ్ పర్సంటేజ్‌ను పెంచుకోండి, హెల్దీగా ఉంచుకోండి.