Health news:మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఐరన్ లోపం కారణం కావచ్చు!..కొత్త అధ్యయనం ఏం చెబుతోందంటే..

Health news:మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఐరన్ లోపం కారణం కావచ్చు!..కొత్త అధ్యయనం ఏం చెబుతోందంటే..

మైగ్రేన్.. ఇప్పుడు భారీతీయులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. తలలో ఒకవైపు (ఒక పార్శ్వంలో) వచ్చే విపరీతమైన నొప్పి..  ఇది సూర్యుడు ఉదయించినప్పటికీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు అధికంగా బాధిస్తుంది.దీనినే పార్శ్వ నొప్పి అంటారు. మైగ్రేన్ చాలామందిలో కనిపిస్తుంది. మైగ్రేన్ కు ప్రధాన కారణాలేవో స్పష్టంగా తెలియనప్పటికీ మైగ్రేన్ తో బాధపడేవారిలో రక్తహీనత (అనిమియా)ఉన్నట్లు పరిశోధకులు  గుర్తించారు. ముఖ్యంగా మహిళల్లో ఇది స్పష్టంగా కనిపించింది. మైగ్రేన్ ఉన్నవారిలో హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్ (శరీరంలో ఐరన్ నిల్వలను తెలిపే సూచిక) స్థాయిలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది.

అంతేకాకుండా, మైగ్రేన్ ఎంత తీవ్రంగా ఉంటే, ఐరన్ స్థాయిలు అంత తక్కువగా ఉండే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.ఐరన్ లోపం వల్ల మెదడు కణాల పనితీరు ప్రభావితమవడం మైగ్రేన్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

►ALSO READ | కోపం, స్ట్రెస్ వల్ల మీ అందం తగ్గుతోందా ? మీకు తెలియకుండానే మీ అందాన్ని తినేస్తున్న 4 నెగెటివ్ ఎమోషన్స్ ఇవే !

అయితే  ఈ అధ్యయనం ఐరన్ లోపమే మైగ్రేన్‌కు నేరుగా కారణమని నిరూపించలేదు. రెండింటి మధ్య సంబంధం ఉందని మాత్రమే సూచించింది. దీనిని పూర్తిగా నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం చేపట్టారు. 

మీకు తరచూ మైగ్రేన్‌తో పాటు అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనీమియా లక్షణాలు ఉంటే, వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఐరన్ లోపం నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. స్వయంగా ఐరన్ మాత్రలు వాడొద్దు. సమతుల ఆహారం, అవసరమైన పరీక్షలు, సరైన వైద్య సలహాతో మైగ్రేన్‌తో పాటు ఐరన్ లోపాన్ని కూడా సమర్థంగా నియంత్రించవచ్చుంటున్నారు పరిశోధకులు.