ఎమోషన్స్ ఎఫెక్ట్ మనసుపైనే కాదు బాడీ మీద కూడా పడుతుంది. ముఖ్యంగా ఫేస్ లో చూపించే నెగెటివ్ ఎమోషన్స్ ప్రభావం చర్మం మీద చాలా ఉంటుందట. 'ఎందుకంటే శరీరంలోని అన్ని భాగాల కంటే తొందరగా స్ట్రెస్ కు లోనవుతుంది చర్మం' అంటున్నారు కాస్మెటిక్ సర్జన్ గీతా గ్రెవల్.
నెగటివ్ మూడ్స్, వాటి కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి బయటపడాలంటే హెల్దీ లైఫ్ స్టెల్ అలవాటు చేసుకోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేయాలి. దాంతో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడి, బాధ నుంచి రిలీఫ్ ఇస్తాయి. అలాగే, రోజూ కొంచెం సేపు నవ్వాలి. లాఫింగ్ అనేది అన్ని రకాల సమస్యలకు బెస్ట్ మెడిసిన్.
స్ట్రెస్: ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ రక్తనాళాలను బలహీనపరుస్తుంది. చర్మ కణాల ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు చాక్లెట్లు, సాల్ట్ ఎక్కువగా ఉండే చిప్స్ తినాలనిపిస్తుంది. నీళ్లు తక్కువ తాగుతారు. చర్మం ముడతలు, గీతలుగా కనిపించడం వంటి చాలా చర్మ సమస్యలకు డీహైడ్రేషన్ ప్రధాన కారణం. స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువై చర్మం రంగు మారుతుంది. రక్తనాళాల సైజ్ తగ్గి, చర్మానికి రక్తం, న్యూట్రియెంట్స్, నీళ్లు తక్కువ అందుతాయి. దాంతో స్కిన్ డల్ గా కనిపిస్తుంది.
ALSO READ : Skin Special: బేబీ ఆయిల్ .. పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకూ చాలా బెనిఫిట్.. స్కిన్ రాషెస్ తగ్గుతాయి
కోపం: కోపంలో గట్టిగా అరుస్తాం. ఆ టైంలో ముఖంలోని కండరాలు ఒత్తిడికి లోనవుతాయి. దాంతో చర్మం మీద గీతలు ఏర్పడతాయి. అంతేకాకుండా చర్మం తనంతట తాను రిపేర్ చేసుకొనే శక్తి మీద ప్రభావం పడుతుంది. ఊరికినే కోపం తెచ్చుకునే వాళ్లలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్ కొల్లాజెన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్లతో పోల్చితే, ఎప్పుడూ కోపంగా ఉండేవాళ్లలో స్కిన్ రిపేర్కి నాలుగు రెట్లు ఎక్కువ టైం పడుతుందని చెప్తున్నారు రీసెర్చర్స్.
డిప్రెషన్: డిప్రెషన్లో ఉన్నప్పుడు అస్తమానం కనుబొమలను కదిలిస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఫేస్ మీద ముడతలు వస్తాయి. ఈ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ చర్మాన్ని ఎంతో ప్రభావం చేస్తాయి. ఇన్ ఫ్లమేషన్ కు గురైన చర్మ కణాల రిపేరింగ్ నెమ్మదిస్తుంది. లాంగ్ టైం డిప్రెషన్ నిద్రలేమికి కారణమవుతుంది. దాంతో కళ్ల కింద క్యారీబ్యాగ్స్ ఏర్పడతాయి.
భయం: భయం వేసినప్పుడు, డేంజర్ లో ఉన్నప్పుడు మెదడు చేసే మొదటి పని అడ్రినల్ గ్రంథులకి సిగ్నల్ ఇవ్వడం. అడ్రినల్ హార్మోన్ విడుదల ఎక్కువైతే, హార్ట్ బీట్ పెరుగుతుంది. శరీరంలోని పెద్ద కండరాలకు రక్త సరఫరా ఎక్కువవుతుంది. ఒక్కోసారి ముఖం, చర్మం దగ్గరి రక్తనాళాల సైజ్ తగ్గిపోతుంది. దీనితో స్కిన్ పాలిపోయినట్టు కనిపిస్తుంది.
