పెట్రోల్ రేట్లు తగ్గుతాయా లేదా : కేంద్ర మంత్రి సమాధానం ఇదే

పెట్రోల్ రేట్లు తగ్గుతాయా లేదా : కేంద్ర మంత్రి సమాధానం ఇదే

అమెరికా, ఇరాన్ మధ్య యుద్దంకారణంగా  పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.. అయితే యుద్దానికి  తాత్కాలికంగా బ్రేక్ పడింది.. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ముడి చమురు ధరలు తగ్గి యుద్దానికి ముందున్న పాత ధరలకు చేరాయి. ఈ క్రమంలో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. 

దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు అమెరికా, ఇరాన్ యుద్దానికి ముందు అంటే రెండు నెలల క్రితం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించాం.. ఇప్పుడు పశ్చిమాసియాలో  ఉద్రిక్తతలు తగ్గడంతో  ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. గతంలో నిర్ణయించిన రేట్లతో ముడి చమురు కొనుగోలు చేశాం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే  పెట్రోల్ ధరల తగ్గింపు సమీక్షిస్తామని అన్నారు. 

►ALSO READ | ముంబైని ముంచెత్తుతున్న వానలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు..దడ పుట్టిస్తున్న దృశ్యాల వీడియోస్

పశ్చిమాసియాలో ఘర్షణల సమయంలో కొనుగోలు చేసిన  ముడి చమురును ఆయిల్ కంపెనీలు ఇప్పటికీ  శుద్ది చేసి విక్రయిస్తున్నాయి.  అందువల్ల ముడి చమురు ధరల తగ్గుదల ఇంకా రిటైల్ ఇంధన  ధరల తగ్గుదలకు  రాలేదని పెట్రోలియం మంత్రి చెప్పారు. 

జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్,ఎల్ పీజీ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు  విక్రయించడంతో  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.74వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని మంత్రి అన్నారు. 

యుద్దం ప్రారంభమైన తర్వాత రిటైల్ ఇంధన ధరలు  లీటరకు రూ.7.50 లు పెరిగాయి.  ఈ ప్రభావాన్ని  తగ్గించేందుకు  ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని  తగ్గించింది..  ఆ తర్వాత రిటైల్ ధరలు పెంచేందుకు అనుమతించామన్నారు.