With Love OTT Release: ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

With Love OTT Release: ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'.. ఎప్పుడు ఎక్కడ  స్ట్రీమింగ్ కానుందంటే?

డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా, అనస్వర రాజన్ కథానాయికగా నటించిన చిత్రం ‘విత్ లవ్’ (With Love).  రొమాంటిక్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 6, 2026న తమిళం , తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఈ సినిమా ఇప్పుడు  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోగా మారిన డైరెక్టర్..

ఫిబ్రవరి నెలలో విడుదలైన ప్రేమకథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన సినిమా ‘విత్ లవ్’  సినీ ప్రియులను అలరించింది.  'టూరిస్ట్ ఫ్యామిలీ' (Tourist Family) డైరెక్టర్ అభిషన్ జీవింత్ వెండితెరకు ఈ మూవీతో నటుడిగా పరిచయం అయ్యారు. కొత్త దర్శకుడు మదన్ తెరకెక్కించిన ఈ చిత్రం, ఒక ఆహ్లాదకరమైన ప్రేమకథగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా చక్కగా బ్యాలెన్స్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

ఎవరెవరు ఎలా చేశారంటే

 అభిషన్ జీవింత్ కు నటుడిగా మొదటి సినిమా అయినప్పటికీ, తన సహజ సిద్ధమైన నటనతో అభిషన్ మంచి మార్కులు కొట్టేశారు. ఆయన సరసన మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి మెలోడీ మాస్టర్ షాన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆయన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి.  జియాన్ ఫిల్మ్స్ (Zion Films), ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ (MRP Entertainment) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఓటీటీ విడుదల ఎప్పుడు?

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన సరిగ్గా ఒక నెలకు, అంటే మార్చి 6, 2026న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తమిళం, తెలుగు వెర్షన్లతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

►ALSO READ | Vijay-Rashmika Wedding: విజయ్ రష్మికల కళ్యాణ ముహూర్తం ఇదే.. ముచ్చటగా రెండు పద్ధతుల్లో పెళ్లి!

కథా నేపథ్యం

ఒక ఆధునిక ప్రేమకథలో ఎదురయ్యే సవాళ్లు, ఆకర్షణ,అపార్థాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సరళమైన కథనం, క్లీన్ కామెడీ ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. అభిషన్ జీవింత్ క్రేజ్ కారణంగా తమిళనాట ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమాకు గ్లోబల్ రీచ్ లభించే అవకాశం ఉందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.